Ashok Gehlot : త‌ప్పైంది మేడం మ‌న్నించండి – గెహ్లాట్

ఎమ్మెల్యేల ధిక్కార స్వ‌రంపై సీఎం వివ‌ర‌ణ

Ashok Gehlot : రాజ‌స్థాన్ లో చోటు చేసుకున్న సంక్షోభం మ‌రింత ముదిరింది. నువ్వా నేనా అన్న రీతిలో కొన‌సాగుతున్న ఆధిప‌త్య పోరు తీవ్ర రూపం దాల్చింది. కాంగ్రెస్ పార్టీ చీఫ్ ప‌ద‌వి బ‌రిలో తాను ఉన్నానంటూ ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు గెహ్లాట్.

దీంతో తాను ఢిల్లీతో పాటు రాజ‌స్థాన్ లో కూడా ఉంటాన‌ని ప్ర‌క‌టించారు సీఎం. అయితే పార్టీకి సంబంధించి ఒక‌రికి ఒక ప‌ద‌వి మాత్ర‌మే ఉండాల‌ని రెండు ప‌ద‌వులు ఉండ కూడ‌ద‌ని ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. సీఎంగా ఎవ‌రు ఉంటార‌నే దానిపై ఉత్కంఠ నెల‌కొంది.

స‌చిన్ పైల‌ట్ వర్సెస్ గెహ్లాట్ మ‌ధ్య ఆధిప‌త్య పోరు కొన‌సాగుతోంది. ఇదే క్ర‌మంలో అశోక్ గెహ్లాట్(Ashok Gehlot) కు మ‌ద్ద‌తుగా 90 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తామ‌ని ప్ర‌క‌టించ‌డంతో రాజ‌కీయం మ‌రింత ముదిరింది. దీనిపై సీరియ‌స్ గా స్పందించారు పార్టీ తాత్కాలిక చీఫ్ సోనియా గాంధీ.

ఈ మేర‌కు సంక్షోభాన్ని ప‌రిష్క‌రించేందుకు గాను పార్టీకి సంబంధించిన సీనియ‌ర్ నాయ‌కులు అజ‌య్ మాకెన్, ఎంపీ మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే ల‌ను ప‌రిశీల‌కులుగా నియ‌మించింది సోనియా గాంధీ. వారిద్ద‌రూ జైపూర్ కు వెళ్లారు. కానీ వారి ప్ర‌య‌త్నాలు ఫ‌లించ లేదు.

పైగా ఎమ్మెల్యేలు ధిక్కార స్వ‌రాన్ని వినిపించ‌డంపై సీరియ‌స్ అయ్యింది పార్టీ హైక‌మాండ్. 90 మందికి పైగా ఎమ్మెల్యేలు తాము స‌చిన్ పైల‌ట్ సీఎంగా నియ‌మిస్తే ఒప్పుకోబోమంటూ వార్నింగ్ ఇచ్చారు. అంతే కాకుండా ప‌రిశీల‌కుల‌ను క‌లిసేందుకు ఒప్పుకోలేదు. దీనిపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు కేసీ వేణుగోపాల్.

ప‌రిస్థితి సీరియ‌స్ గా ఉండ‌డంతో గ‌మ‌నించిన సీఎం అశోక్ గెహ్లాట్ స్పందించారు. ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయ‌డంలో త‌న ప్ర‌మేయం ఎంత మాత్రం లేద‌న్నారు. ద‌య‌చేసి త‌న‌ను మ‌న్నించ‌మ‌ని కోరారు మేడం సోనియా గాంధీని(Sonia Gandhi) గెహ్లాట్.

Also Read : అక్టోబ‌ర్ నుంచి 5జీ సేవ‌లు షురూ

Leave A Reply

Your Email Id will not be published!