Udhampur Bus Blast : జమ్మూ కాశ్మీర్ లో పేలుళ్లు..అలర్ట్
ఉధంపూర్ లో గంటలో రెండుసార్లు
Udhampur Bus Blast : జమ్మూ కాశ్మీర్ లో అక్టోబర్ 4న కేంద్ర హొం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా పర్యటించాల్సి ఉంది. ఈ తరుణంలో ఉగ్రవాదులు దాడులు ముమ్మరం చేశారు. నిన్న భారత బలగాలు జరిపిన కాల్పుల్లో ముగ్గురు జైషే -ఎ-మహ్మద్ కు చెందిన తీవ్రవాదుల్ని మట్టుబెట్టారు.
ఈ తరుణంలో గురువారం ఉదయం ఊహించని రీతిలో ఉధంపూర్(Udhampur Bus Blast) నగరంలో రెండు చోట్ల పేలుళ్లు సంభవించాయి. గంటలో ఇది రెండోసారి. స్థానిక బస్టాండ్ లో ఆపి ఉంచిన బస్సులో పేలుడు సంభవించింది. కొన్ని గంటల్లో ఇది రెండోది. దీంతో భద్రతా బలగాలు హై అలర్ట్ ప్రకటించాయి.
ఏజెన్సీలు ఉలిక్కి పడ్డాయి. తెల్ల వారుజామున 5.30 గంటల ప్రాంతంలో జరిగిన పేలుడు ధాటికి బస్సు పైకప్పు వెనుక భాగం ఎగిరి పోయింది. కాగా ఎవరికీ గాయాలు కాక పోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇదిలా ఉండగా హోం శాఖ మంత్రి అమిత్ షా సెప్టెంబర్ 30న జమ్మూ , కాశ్మీర్ లో మూడు రోజుల పాటు పర్యటించాల్సి ఉంది.
అక్టోబర్ 1న రాజౌరి, బారాముల్లాలో బహిరంగ సభలను నిర్వహించాల్సి ఉంది. ఘటనలు చోటు చేసుకోవడంతో షా టూర్ ను రీ షెడ్యూల్ చేశారు. బుధవారం రాత్రి డోమైల్ చౌక్ వద్ద పెట్రోల్ పంపు సమీపంలో ఆపి ఉంచిన ఖాళీ బస్సులో పేలుడు సంభవించింది.
ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. ప్రతి రోజూ బస్సును స్పాట్ లో పార్క్ చేసేవారు. రెండో పేలుడు సంభవించిన బస్సు ఉధంపూర్ జిల్లా లోని బసంత్ గఢ్ నుండి వచ్చి బస్టాండ్ లో రాత్రి ఆగి ఉంది. ఉదయం బసంత్ గఢ్ కు బయలు దేరాల్సి ఉంది.
Also Read : భారత్ కు వెళ్లే ముందు జాగ్రత్త – కెనడా