Yuva 2.0 Scheme : యువ రచయితల కోసం పథకం
యువ 2.0 ప్రత్యేక పథకం ప్రారంభం
Yuva 2.0 Scheme : దేశంలో యువ రచయితలకు కొదువ లేదు. నిత్యం వినూత్నంగా ఆలోచించే దేశాధినేతల్లో ఒకరిగా గుర్తింపు పొందారు దేశ ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ. వారిలో ఉన్న ప్రతిభా పాటవాలను వెలికి తీసి మరింత ప్రోత్సహించేందుకు గాను కేంద్ర ప్రభుత్వం కొత్తగా యువ 2.0 పథకాన్ని(Yuva 2.0 Scheme) ప్రారంభించారు.
మొదటి ఎడిషన్ లో యువ రచయితలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇదిలా ఉండగా కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ యువ, రాబోయే , బహుముఖ రచయితల కోసం దీనిని ప్రారంభించింది.
ఈ పథకం ప్రధాన ఉద్దేశం యవ రచయితలకు మార్గదర్శకత్వం వహించడం. దేశంలో చదవడం, రాయడం, పుస్తక సంస్కృతిని ప్రోత్సహించేందుకు ప్రపంచ వ్యాప్తంగా భారతదేశం , భారతీయ రచనలను ప్రొజెక్టు చేసేందుకు 30 ఏళ్ల లోపు యువ , వర్దమాన రచయితలకు శిక్షణ ఇవ్వనున్నారు.
యువ 2.0(Yuva 2.0 Scheme) అనేది ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో ఒక భాగం. సంస్థలు, సంఘటనలు, ప్రజలు, రాజ్యాంగ విలువలు, గతం, వర్తమానం, భవిష్యత్తు గురించి వినూత్న, సృజనాత్మక పద్దతిలో భారతీయ వారసత్వం, సంస్కృతి , విజ్ఞాన సంస్థను ప్రోత్సహించడమే దీని ముఖ్య ఉద్దేశం.
రాసే రచయితల ప్రవాహాన్ని అభివృద్ది చేసేందుకు ఈ పథకం సహాయ పడుతుంది. మొదటి ఎడిషన్ కు అపూర్వమైన ఆదరణ లభించింది.
మొదటి ఎడిషన్ లో ఇంగ్లీషుతో సహా 22 విభిన్న భారతీయ భాషల్లోని యువ రచయితలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. భారతదేశ ప్రజాస్వామ్యాన్ని అర్థం చేసుకునేందుకు అభినందించేందుకు యువతను ప్రోత్సహించేందుకు పీఎం దృష్టికి అనుగుణంగా ఉంది.
Also Read : ఏడాది పూర్తయినా అందని న్యాయం