Karnataka Govt Ban : ఓలా..ఉబ‌ర్..రాపిడో స‌ర్వీసుల‌కు షాక్

క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న

Karnataka Govt Ban : క‌ర్ణాట‌క‌లోని భార‌తీయ జ‌న‌తా పార్టీ ప్ర‌భుత్వం సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. ఈ మేర‌కు కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇందులో భాగంగా ఓలా, ఉబ‌ర్, రాపిడో ఆటో స‌ర్వీసుల‌పై నిషేధం విధిస్తున్న‌ట్లు స్ప‌ష్టం చేసింది.

యాప్ ఆధారిత ఆటో సేవ‌ల‌ను వెంట‌నే నిలిపి వేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేర‌కు స‌ర్కార్ ప‌రంగా అధికారికంగా ఉత్త‌ర్వులలో వెల్ల‌డించింది. ఈ ఆటో సేవ‌ల‌న్నీ చ‌ట్ట విరుద్ద‌మంటూ పేర్కొంది. అంతే కాకుండా మూడు రోజుల్లో సేవ‌ల‌ను నిలిపి వేయాల‌ని స్ప‌ష్టం చేసింది క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం(Karnataka Govt Ban).

ప్ర‌భుత్వ ఆదేశాల మేర‌కు క‌ర్ణాట‌క రాష్ట్ర ర‌వాణా శాఖ నోటీసులు జారీ చేసింది. ఇందులో ఆటో సేవ‌ల‌ను వెంట‌నే నిలిపి వేయాలి. ప్ర‌భుత్వం నిర్దేశించిన ఛార్జీల కంటే ప్ర‌యాణీకుల నుండి ఎక్కువ వ‌సూలు చేయ‌వ‌ద్దంటూ కూడా ఆదేశించింది. ఇందుకు సంబంధించి స‌మ్మ‌తి నివేదిక‌లు దాఖ‌లు చేసేందుకు అగ్రిగేట‌ర్ల‌కు ర‌వాణా శాఖ మూడు రోజుల గ‌డువు ఇచ్చింది.

ఇదిలా ఉండ‌గా ఓలా..ఉబ‌ర్..రాపిడో ఆటో స‌ర్వీసు కంపెనీలు క‌నీస ధ‌ర‌గా రూ. 100 వసూలు చేస్తున్నాయంటూ ప్ర‌యాణికులు రాష్ట్ర ప్ర‌భుత్వానికి ఫిర్యాదు చేసిన‌ట్లు స‌మాచారం.

ప్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం ఆటో డ్రైవ‌ర్లు మొద‌టి రెండు కిలోమీట‌ర్ల‌కు రూ. 30 , ఆ త‌ర్వాత కిలోమీట‌ర్ కు రూ. 15 చొప్పున నిర్ణీత రేటుగా వ‌సూలు చేయాల‌ని ఇప్ప‌టికే ర‌వాణా శాఖ స్పష్టం చేసింది.

కానీ ఈ రూల్స్ కు విరుద్దంగా ఆటో స‌ర్వీసులు వ‌సూలు చేస్తుండ‌డంపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ స‌ర్కార్ షాక్ ఇచ్చింది. టాక్సీల‌కు మాత్ర‌మే నిబంధ‌న‌లు వ‌ర్తిస్తాయ‌ని పేర్కొంది. ఇదిలా ఉండ‌గా మూడు కంపెనీలు ఇంకా స్పందించ లేదు.

Also Read : వాట్సాప్ కు దూరంగా ఉండండి – డ్యూరోవ్

Leave A Reply

Your Email Id will not be published!