MK Stalin : హిందీ భాషను రుద్దితే యుద్ధమే – స్టాలిన్
హిందీ ప్యానల్ నివేదికపై తీవ్ర ఆగ్రహం
MK Stalin : ఓ వైపు హిందీని ఎలాగైనా దేశ వ్యాప్తంగా అధికారికంగా అమలు చేయాలని కేంద్రంలోని మోదీ ప్రభుత్వం దూకుడుతో ఉంది. కానీ మిగతా బీజేయేతర రాష్ట్రాలు తల వంచడం లేదు. ప్రధానంగా తమిళనాడులో కొలువుతీరిన డీఎంకే సర్కార్ నిప్పులు చెరుగుతోంది. ఇప్పటికే తమిళులు మూకుమ్మడిగా దాడి చేయడం మొదలు పెట్టారు.
తాజాగా సంచలన కామెంట్స్ చేశారు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్(MK Stalin). హిందీ ప్యానల్ నివేదికపై సీఎం స్పందించారు. మరో భాషా యుద్దాన్ని విధించ వద్దని హెచ్చరించారు. తమపై ఇంకొకరి పెత్తనాన్ని సహించే ప్రసక్తి లేదని కుండబద్దలు కొట్టారు.
ఇదిలా ఉండగా హిందీ వినియోగంలో పురోగతిని సమీక్షించేందుకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా అధ్యక్షతన అధికారిక భాషపై పార్లమెంట్ కమిటీ గత నెలలో రాష్ట్రపతికి తాజా నివేదికను సమర్పించింది. దీని గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు ఎంకే స్టాలిన్.
డీఎంకే చారిత్రాత్మకంగా హిందీ విధింపు వ్యతిరేక నిరసనలకు నాయకత్వం వహించి తీరుతుందని స్పష్టం చేశారు. హిందీ మాట్లాడే వారిని ఒంటరిగా భారతీయ పౌరులుగా, ఇతరులను ద్వితీయ శ్రేణి పౌరులుగా అంచనా వేయడం విభజించి పాలించేలా ఉందన్నారు స్టాలిన్.
పార్లమెంట్ భాషా కమిటీ నివేదించిన నేపథ్యంలో కేంద్రం నడిచే విద్యాసంస్థలు మారాలని సూచించడాన్ని తప్పు పట్టారు. సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్దిని పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం అన్ని ఎనిమిదో షెడ్యూల్ భాషలను అధికారిక భాషలుగా పరిగణించాలని సీఎం స్టాలిన్ కోరారు.
50 ఏళ్ల కిందట దక్షిణాదిలో హిందీ వ్యతిరేక ఉద్యమాన్ని నిర్వహించారు. తన తండ్రి దివంగత మాజీ సీఎం కరుణానిధి నాయకత్వం వహించారు.
Also Read : రాజకీయ రంగంపై చెరగని ముద్ర