FSSAI : విదేశీ ఆహార సంస్థ‌ల‌కు రిజిస్ట్రేష‌న్ త‌ప్ప‌నిస‌రి

ఫుడ్ సేఫ్టీ అథారిటీ కీల‌క ఆదేశం

FSSAI : విదేశీ సంస్థ‌ల‌కు కోలుకోలేని షాక్ ఇచ్చింది భార‌త ప్ర‌భుత్వం. ఈ మేర‌కు పాలు, మాంసాన్ని ఎగుమ‌తి చేసేందుకు విదేశీ సంస్థ‌ల‌కు పుడ్ సేఫ్టీ అథారిటీ రిజిస్ట్రేష‌న్ త‌ప్ప‌నిస‌రి అని పేర్కొంది. ఇప్ప‌టికే ఉన్న త‌యారీదారులు ఈ ఆహార ఉత్ప‌త్తుల‌ను భార‌త దేశానికి ఎగుమ‌తి చేసేందుకు ఉద్దేశించిన వారి జాబితాను అందించాల‌ని ఎఫ్ఎస్ఎస్ఏఐ(FSSAI) స్ప‌ష్టం చేసింది.

ఇందులో భాగంగా పాలు, మాంసాన్ని ఎగుమ‌తి చేసేందుకు విదేశీ సంస్థ‌ల‌కు ఫుడ్ సేఫ్టీ అథారిటీ రిజిస్ట్రేష‌న్ త‌ప్ప‌నిస‌రి చేసిన‌ట్లు పేర్కొంది. విదేశీ ఆహార క‌ర్మాగారాల రిజిస్ట్రేష‌న్ ప్ర‌క్రియ వ‌చ్చే ఏడాది 2023 ఫిబ్ర‌వ‌రి నుండి ప్రారంభం అవుతుంద‌ని తెలిపింది.

పాలు, మాంసం, శిశువుల‌కు సంబంధించిన ఆహారాలు వంటి ఉత్ప‌త్తుల‌ను భార‌త దేశానికి ఎగుమ‌తి చేసేందుకు విదేశీ ఆహార త‌యారీ కేంద్రాలు త‌మ వ‌ద్ద త‌ప్ప‌నిస‌రిగా న‌మోదు చేసుకోవాల‌ని స్ప‌ష్టం చేసింది. లేక‌పోతే తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని హెచ్చ‌రించింది.

ఈ మేర‌కు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండ‌ర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఈ ఉత్ప‌త్తుల‌ను ఎగుమ‌తి చేసేందుకు ఉద్దేశించిన ఐదు ఆహార కేట‌గిరీల ప‌రిధిలోకి వ‌చ్చే విదేశీ ఆహార త‌యారీ సౌక‌ర్యాల రిజిస్ట్రేష‌న్ త‌ప్ప‌నిస‌రి అని నిర్ణ‌యించిన‌ట్లు తెలిపింది.

పాలు, పాల ఉత్ప‌త్తులు, మాంసం, మాంసం ఉత్ప‌త్తులు, గుడ్డు పొడి, పిల్ల‌ల‌కు సంబంధించిన ఆహారం, న్యూట్రిస్యూటిక‌ల్స్ ఉన్నాయి. ఇప్ప‌టికే ఉన్న త‌యారీదారులు , ఎగుమ‌తి చేసేందుకు ఉద్దేశించిన జాబితాను వెంట‌నే త‌మ‌కు అందించాల‌ని ఎఫ్ఎస్ఎస్ఏఐ కోరింది. అందించిన స‌మాచారం ఆధారంగా త‌న పోర్ట‌ల్ లో న‌మోదు చేస్తుంది.

Also Read : భార‌త్ లో యాపిల్ ఎయిర్‌పాడ్‌ల త‌యారీ

Leave A Reply

Your Email Id will not be published!