MLA Seethakka : ఎమ్మెల్యే సీతక్కకు డాక్టరేట్ ప్రదానం
రాజనీతి శాస్త్రంలో పరిశోధన
MLA Seethakka : ఆమె ఒకప్పుడు నక్సలైట్ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత జనజీవన స్రవంతిలోకి వచ్చారు. ప్రస్తుతం ములుగు శాసనసభ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కష్ట కాలంలో తన వారికి అండగా నిలవడం ఆమె నైజం. కరోనా సమయంలో ఎందరికో ఆమె ఆసరాగా నిలిచారు.
ఓ వైపు వరదలు చుట్టు ముట్టినా ధైర్యంగా వెళ్లి బాధితులకు అండగా నిలిచారు. తాజాగా సీతక్క(MLA Seethakka)అరుదైన ఘనత సాధించారు. ఆమె అసలు పేరు దాసరి అనసూయ. కానీ అంతా సీతక్కగానే పిలుస్తారు. ఓ వైపు ఎమ్మెల్యేగా ఉంటూనే ప్రజా సేవలో నిమగ్నం అవుతూనే ఏకంగా చదువుపై ఫోకస్ పెట్టారు.
రాజనీతి శాస్త్రంలో డాక్టర్ ఆఫ్ ఫిలాసఫర్ (పీహెచ్ డి) డిగ్రీని పొందారు. ఈ మేరకు ఇవాళ ఎమ్మెల్యే సీతక్కకు డాక్టరేట్ డిగ్రీని ప్రదానం చేశారు. ఇందుకు సంబంధించిన విషయాన్ని ఎమ్మెల్యే సీతక్క ట్విట్టర్ లో వెల్లడించారు. ఆమె పట్టుదలను ప్రతి ఒక్కరు అభినందిస్తున్నారు.
చదువు కోవడంలో ఉన్న విలువ ఇంకెందు లోనూ లేదంటారు ఆమె. వేలాది మంది గిరిజనులు, అడవి బిడ్డలు అక్షరాలకు నోచు కోవడం లేదంటారు. వారంతా చదువు కోవాలని ఆమె ఆకాంక్షిస్తారు. ఈ సందర్భంగా ఆమె తన సంతోషాన్ని పంచుకున్నారు. నేను నక్సలైట్ అవుతానని నా బాల్యంలో అనుకోలేదు.
ఇదే క్రమంలో లాయర్ ను అవుతానని కోరుకోలేదు. ప్రాక్టీసు చేస్తున్నప్పుడు ఎమ్మెల్యేగా గెలుస్తానని కలలో కూడా ఊహించ లేదు. కానీ ఇప్పుడు డాక్టరేట్ కూడా సాధిస్తానని భావించ లేదని పేర్కొన్నారు.
Also Read : డిసెంబర్ 19న కిసాన్ గర్జన ర్యాలీ – బీకేఎస్