Save India Comment : ఆకలి భారతమా అవినీతి దేశమా
75 ఏళ్లయినా తీరు మారని ఇండియా
Save India Comment : ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా పేరొందింది భారత దేశం. కానీ తాజాగా ప్రకటించిన గ్లోబల్ హంగర్ ఇండెక్స్ లో దాయాది పాకిస్తాన్ పొరుగున ఉన్న నేపాల్ కంటే దారుణంగా పడి పోయింది మన ర్యాంకు.
పోనీ నివేదికలు తయారు చేసిన వాళ్లు కావాలని చేశారని అనుకున్నా అసలు దేశానికి సరైన విధానం ఏదైనా ఉందా అంటే ఇప్పటికీ లేదని చెప్పాలి.
ఈ దేశంలో కులాలు, మతాలు, ప్రాంతాలు, దేవుళ్లు, కేసులతోనే ఉన్న సమయం సరి పోతోంది. చట్టాలను రూపొందించాల్సిన వాళ్లు, అమలు చేయాల్సిన యంత్రాంగం, పాలక వర్గం , న్యాయ వ్యవస్థ , పోలీసు రంగం అన్నీ ఒకే చోటుకు చేరి పోయాయి. ఒకే త్రాసులో మిగిలి పోయాయి.
న్యాయం, ధర్మం ఇప్పుడు నాలుగు పాదాల మీద నడవడం లేదు. న్యాయ దేవత కళ్లు మూసుకుంది. సామూహిక రేప్ కు గురై జీవిత ఖైదుకు గురైన వాళ్లను బీజేపీ గుజరాత్ ప్రభుత్వం విడుదల చేసిన ఘన చరిత్ర మనది. ఈ దేశం(Save India) గురించి నేటి పాలకుల గురించి ఎంత చెప్పినా తక్కువే.
మతం పేరుతో విధ్వంసం సృష్టించడం తప్పా దేశం అభివృద్ది అన్నది కనిపించకుండా పోతోంది. ఇది అత్యంత బాధాకరం. నిన్నటి దాకా కరోనా పేరుతో దోపిడీ జరిగింది.
ఇవాళ జనాభాను పక్కన పెడితే డిజిటలైజేషన్ జపం కనిపిస్తోంది. కానీ ఎక్కడా దిద్దుబాటు చర్యలు లేకుండా పోయాయి. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం రోజు రోజుకు పెరుగుతోంది.
డాలర్ బలం పెరగడం వల్లనే భారత రూపాయి క్షీణిస్తోందంటూ చిలుక పలుకులు పలుకుతోంది ఆర్థిక మంత్రి నిర్మలమ్మ. కోట్లాది రూపాయలు కొల్ల గొట్టి దేశం విడిచి పోయిన వారిని పట్టించు కోలేదు. రుణాల పేరుతో టోకరా పెట్టిన బడా బాబులు, వ్యాపారవేత్తలు, కార్పొరేట్ దిగ్గజాల పేరుతో దందాలు చేస్తున్న వారికి చెందిన రుణాలను మాఫీ చేసిన ఘనత బీజేపీ సర్కార్ కే దక్కుతుంది.
ఇక మసీదులు, మందిరాలు, మతాలు, కులాలు, కుమ్ములాటలు, కేసులు, దౌర్జన్యాలు, విద్వేష పూరిత ప్రకటనలు, హత్యలు, దారుణాలు, అత్యాచారాలు, కాల్చివేతలు, కూల్చి వేతలు ఇలా చెప్పుకుంటే చాంతాడంత అవుతుంది భారత ప్రగతి చిట్టా.
ఎన్ని చట్టాలు రూపొందించినా, ఎన్ని కేంద్ర దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగినా కోట్ల కొద్ది నోట్ల కట్టలు గుట్టలు గుట్టలుగా దొరుకుతున్నాయి.
ఈ సొమ్మంతా ఎవరిది. పాలకులదా, రాజకీయ పార్టీలదా లేక 135 కోట్ల ప్రజలదా. ఒక్కసారి కొలువు తీరిన పాలకులు ఆలోచించాలి. టెక్నాలజీ పెరిగినా ఎందుకని ఇంకా ఆకలి కేకలు వినిపిస్తున్నాయో చూడాలి. ఒక్క ఎన్నికల సందర్భంలో కోట్లాది రూపాయలు ఎలా బయటకు వస్తున్నాయో చెప్పాల్సిన బాధ్యత ఈసీపై లేదా.
అది కూడా కళ్లు మూసుకుని ఉండడం వల్లే ఇవాళ ఇన్ని దారుణాలు చోటు చేసుకుంటున్నాయి. ఒక్క నియోజకవర్గంలో ఏకంగా రూ. 4, 000 వేల
కోట్లు ఖర్చు చేసినట్లు ప్రచారం జరిగింది.
లక్షల కోట్ల అవినీతికి ఓ రాష్ట్రం కేరాఫ్ గా మారిందంటే ఏమను కోవాలి. ఇక కర్ణాటకలో అయితే ఏకంగా సీఎం పేరుతో పోస్టర్లు వెలిశాయి.
ఇలా చెప్పుకుంటూ పోతే కోకొల్లలు. ఇదిలా ఉండగా 2019 పార్లమెంటరీ ఎన్నికల్లో ఏకంగా యుఎస్ $2 బిలియన్లు ఖర్చు అయినట్లు అంచనా. ఇక
దేశంలోని పొలిటికల్ పార్టీలకు అందిన విరాళాలు తెలుసుకుంటే కళ్లు బైర్లు కమ్మాల్సిందే.
లెక్కల్లో చూపని డబ్బులు, రాజకీయాల మధ్య అనుబంధం ప్రజాస్వామ్య ప్రక్రియలో అంతర్లీనంగా ఉండడం వల్లనే ఇన్ని దారుణాలు చోటు చేసుకుంటున్నాయి.
మోదీ నోట్ల రద్దు ధనవంతులు, దొంగలు, శక్తివంతులు తమ నల్ల ధనాన్ని వైట్ గా మార్చుకునేందుకు దోహదం చేసింది. సామాన్యులను కష్టాలపాలు
చేసింది. ఆయన ఆలోచన పూర్తిగా దేశ ఆర్థిక వ్యవస్థను సర్వ నాశనం చేసింది. ఇవాళ రూపాయి కనిష్ట స్థాయికి పడి పోయింది.
2018లో ఎలక్టోరల్ బాండ్ పథకాన్ని తీసుకు వచ్చింది. ఇది రాజకీయ పార్టీలకు తెల్ల ఏనుగుల్లాగా ఉపయోగ పడ్డాయి. ఈ దేశం బాగు పడాలన్నా అవినీతి
నుంచి విముక్తి పొందాలంటే పాలకులకు చరమ గీతం పాడాలంటే ప్రజలు మారాలి.
Also Read : ప్రజల కోసం ప్రశ్నిస్తే కేసులా – జనసేనాని