Supreme Court : ద్వేష పూరిత ప్రసంగాలపై ‘సుప్రీం’ సీరియస్
మతం పేరుతో ఇది విషాదకరం
Supreme Court : భారత దేశ సర్వోన్నత న్యాయస్థానం(Supreme Court) సంచలన వ్యాఖ్యలు చేసింది. ద్వేష పూరిత ప్రసంగాలపై దాఖలైన పిటిషన్ పై శుక్రవారం విచారణ చేపట్టింది. జస్టిస్ లు కేఎం జోసెఫ్ , హృషికేష్ రాయ్ లతో కూడిన ధర్మాసనం ఆసక్తికర కామెంట్స్ చేయడం కలకలం రేపింది. మనం పాత కాలంలో లేం. అత్యాధునిక కాలంలో ఉన్నామని పేర్కొంది ధర్మాసనం.
ఇది 21వ శతాబ్దం. ఏ విషయంలో దేవుడిని తగ్గించామో చెప్పాలని ప్రశ్నించారు. ద్వేష పూరిత ప్రసంగాలు దేని కోసం, ఎవరి కోసం చేస్తున్నారంటూ నిలదీసింది.
భారత రాజ్యాంగం అందరి అభిప్రాయాలను గౌరవించాలని చెబుతోంది. ఇప్పుడు ఏ దేవుళ్లకు అన్యాయం జరిగిందో చెప్పాలని నిలదీసింది కోర్టు. ఆర్టికల్ 51 మనకు శాస్త్రీయ దృక్పథాన్ని కలిగి ఉండాలని స్పష్టంగా చెబుతోంది. కానీ మతం పేరుతో దానిని అడ్డం పెట్టుకుని ఇలాంటి విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించింది.
మతం పేరుతో ఒక రకంగా చెప్పాలంటే అత్యంత విషాదకరమని పేర్కొంది కోర్టు. ఈ మొత్తం వివాదాలను, ప్రసంగాలను సుప్రీంకోర్టు తప్పు పట్టింది. ఇదిలా ఉండగా వీరి ప్రసంగాల వల్ల దేశంలో ఇబ్బంది ఏర్పడుతోందంటూ రాజకీయ నేతలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పిటిషన్ దాఖలైంది.
న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. నిందితులపై ఉపా కింద కేసులు పెట్టాలని , స్వతంత్ర దర్యాప్తు చేపట్టాలని కోరారు.
ఇదిలా ఉండగా ఇవాళ ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. మతాల పేరుతో విద్వేష పూరిత ప్రసంగాలు చేసే వారికి హెచ్చరిక లాంటిది ఈ తీర్పు.
Also Read : డీఏవీ పాఠశాల గుర్తింపు రద్దు – సబిత