Rishi Sunak : బ్రిటన్ ప్రధాని రేసులో రిషి సునక్
లిజ్ ట్రస్ రాజీనామాతో సంక్షోభం
Rishi Sunak : బ్రిటన్ ప్రధానమంత్రి లిజ్ ట్రస్(Liz Truss) తన పదవికి రాజీనామా చేయడంతో రాజకీయ సంక్షోభం తారా స్థాయికి చేరింది. ఆర్థిక పరమైన వ్యవస్థను తాను గాడిలో పెట్టలేక పోతున్నానంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ పీఎం పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.
దీంతో ఎవరు ఎన్నికవుతారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే కన్జర్వేటివ్ పార్టీ నుంచి బోరిస్ జాన్సన్ ప్రధానిగా పలు ఆరోపణలు ఎదుర్కొని చివరకు ప్రధాన మంత్రి పదవి నుంచి తప్పుకున్నారు.
ఈ తరుణంలో రిషి సునక్, లిజ్ ట్రస్ మధ్య నువ్వా నేనా అన్న రీతిలో పోటీ నెలకొంది. అనుకోని రీతిలో లిజ్ ట్రస్ గెలుపొందారు. ఆరు వారాల పాటు మాత్రమే కొలువు తీరిన లిజ్ ట్రస్ చివరకు చేతులెత్తేసింది.
తాజాగా కొనసాగుతున్న సంక్షోభానికి తెర పెట్టేందుకు రంగంలోకి దిగారు బోరీస్ జాన్సన్. ప్రస్తుతం ఎక్కువగా రిషి సునక్ ప్రధానమంత్రి అయ్యేందుకు అవకాశం ఉందని జోరుగా ప్రచారం జరుగుతోంది. తమ తోటి కన్జర్వేటివ్ ఎంపీల నుండి 100 నామినేషన్లను గెలుచు కోవాల్సి ఉంటుంది.
ఇటీవలి నాయకత్వ పోటీ ప్రారంభ రౌండ్లలో రిషి సునక్(Rishi Sunak) టోరీ చట్టసభ సభ్యుల మద్దతును పొందారు. మాజీ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ సాహసోపేతమైన పునరాగమనాన్ని లక్ష్యంగా చేసుకున్నందున బ్రిటీష్ కన్జర్వేటివ్ రాజకీయ నాయకుడు రిషి సునక్ చివరిలో పార్టీ నాయకుడిగా పోటీ చేసేందుకు కనీస స్థాయికి చేరుకున్నారు.
లిజ్ ట్రస్ రాజీనామా చేయడంతో యుకె అధికార పార్టీ రెండవ నాయకత్వ పోటీకి క్యాబినెట్ సభ్యురాలు పెన్నీ మోర్డాంట్ తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు.
Also Read : ఇమ్రాన్ ఖాన్ కు ఎన్నికల సంఘం షాక్