Prashant Kishor : ప్రధాని మోదీపై ప్రశాంత్ కిషోర్ ఫైర్
ధరల పెరుగుదలపై సీరియస్
Prashant Kishor : ఇండియన్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్(Prashant Kishor) షాకింగ్ కామెంట్స్ చేశారు. దేశంలో రోజు రోజుకు ధరలు పెరుగుతున్నా కనీసం కంట్రోల్ చేయలేని పరిస్థితిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉన్నారని ఆరోపించారు. గత కొంత కాలంగా మౌనంగా ఉన్న పీకే ఉన్నట్టుండి ఆరోపణలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
బీహార్ లో ప్రశాంత్ కిషోర్ పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. నర్కటియాగంజ్ లో గ్రామస్థులను ఉద్దేశించి ప్రసంగించారు. వ్యాపారులు, కార్పొరేట్లకు ప్రయారిటీ ఇస్తున్న కేంద్ర ప్రభుత్వం ప్రధానంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పట్టించుకోక పోవడం దారుణమన్నారు పీకే.
ద్రవ్యోల్బణం, నిరుద్యోగం రోజు రోజుకు పెరుగుతోందని కానీ దానిని నియంత్రించేందుకు చర్యలు తీసుకోక పోవడం బాధాకరమన్నారు. పీకే ప్రధానమంత్రిని(PM Modi) టార్గెట్ చేయడం కలకంల రేపింది. ఆయన గతంలో మోదీకి సలహాదారుగా ఉన్నారు. ఆయనను పీఎంగా చేయడంలో కీలక పాత్ర పోషించారు.
ఆ తర్వాత బంధం చెడింది. ఇదే సమయంలో ఇప్పటికీ ప్రధానితో సంబంధం తెంచుకున్నా లోలోపట ప్రశాంత్ కిషోర్ భారతీయ జనతా పార్టీకి అంతర్గతంగా పని చేస్తున్నారంటూ జేడీయూ చీఫ్, బీహార్ సీఎం నితీశ్ కుమార్(Nitish Kumar) సంచలన ఆరోపణలు చేశారు. తనను టార్గెట్ చేసిన పీకేపై నిప్పులు చెరిగారు.
జన్ సురాజ్ పేరుతో ప్రశాంత్ కిషోర్ వీడియో షేర్ చేశారు. హర్ హర్ మోడీ ఘర్ ఘర్ మోడీ అని నినాదాలు చేస్తే మోదీ అయ్యాడు. వంట గ్యాస్ ధర సిలిండర్ కు రూ. 500 నుండి రూ. 1,300కి పెరిగింది. మరోసారి పీఎం అయితే సిలిండర్ ధర రూ. 2,000కి చేరే ఛాన్స్ ఉందని ఆరోపించారు.
Also Read : పీకేకు పబ్లిసిటీ పిచ్చి – నితీశ్ కుమార్