Kiren Rijiju : పాత చట్టాలకు కేంద్రం మంగళం – రిజిజు
కేంద్ర న్యాయ శాఖ మంత్రి ప్రకటన
Kiren Rijiju : కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరెన్ రిజిజు సంచలన ప్రకటన చేశారు. ఆయన గత కొంత కాలం నుంచీ న్యాయ వ్యవస్థపై కీలక వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. ప్రధానంగా న్యాయ వ్యవస్థలో మోనోపలీ ఉందని పేర్కొన్నారు. ఆపై ప్రపంచంలో ఎక్కడా లేని రీతిలో ఒక్క భారత దేశంలోనే కొలీజియం వ్యవస్థ ద్వారా న్యాయమూర్తుల నియామకం జరుగుతుందని ఆరోపణలు చేశారు.
అంతే కాదు న్యాయమూర్తులు తమ విధులను వదిలేసి రాజకీయాలు చేస్తున్నారంటూ నిప్పులు చెరిగారు. దీంతో దేశ వ్యాప్తంగా కిరెన్ రిజిజు చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఇదే సమయంలో మరో సంచలన కామెంట్ కూడా చేశారు. న్యాయ వ్యవస్థలో తప్పు పట్టి పోయిన చట్టాలను సమూలంగా మార్చాల్సి ఉందన్నారు.
ఇదే సమయంలో శనివారం సంచలన ప్రకటన చేశారు. పనికిరాని పాత చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పారు కిరెన్ రిజిజు(Kiren Rijiju). 75 ఏళ్ల స్వతంత్ర భారత దేశంలో ఇలాంటి ప్రకటన రావడం ఒక రకంగా హర్షించ దగిన విషయమే.
భారతీయ జనతా పార్టీలో ఆధునిక భావజాలం కలిగిన మంత్రులలో కిరెన్ రిజిజు ఒకరు. దేశ ప్రజలకు అంతగా ఉపయోగం లో లేని పురాతన చట్టాలను తొలగిస్తున్నట్లు స్పష్టం చేశారు కేంద్ర న్యాయ శాఖ మంత్రి. వీటిని తొలగించి ప్రజలకు ప్రశాంత జీవనం అందించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కంకణం కట్టుకున్నారని తెలిపారు.
ప్రస్తుతం కిరెన్ రిజిజు చేసిన ప్రకటన కలకలం రేపుతోంది.
Also Read : సీఎం యోగికి స్వాతి మలివాల్ లేఖ