Sunil Deodhar : జనసేనతో స్నేహం టీడీపీతో పొత్తు పెట్టుకోం
బీజేపీ ఏపీ వ్యవహారాల ఇంఛార్జి సునీల్ దియోధర్
Sunil Deodhar : ఏపీలో రాజకీయ సమీకరణలు వెంట వెంటనే మారిపోతున్నాయి. ఈ తరుణంలో టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ తో భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. రాబోయే ఎన్నికల్లో ఇరు పార్టీలు కలిసి పోటీ చేస్తాయన్న ప్రచారం జరిగింది.
దీంతో జనసేనతో పొత్తు ఉండదన్న ఊహాగానాలకు తెర దించింది భారతీయ జనతా పార్టీ. ఈ మేరకు కీలక ప్రకటన చేశారు బీజేపీ ఏపీ వ్యవహారాల ఇంచార్జి సునీల్ దియోధర్(Sunil Deodhar). వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. ఇరు పార్టీలు కలిసి పోటీ చేస్తాయని చెప్పారు.
గతంలో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని తప్పు చేశామని, తమ పార్టీకి తీవ్ర నష్టం జరిగిందని పేర్కొన్నారు. వైసీపీ, టీడీపీలు రెండూ కుటుంబ పార్టీలంటూ ధ్వజమెత్తారు. అవినీతి, అక్రమాలకు ఇరు పార్టీలు కేరాఫ్ గా మారాయని ఆరోపించారు. జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) తో రాష్ట్రంలో రోడ్ మ్యాప్ అంశంపై చర్చిస్తామని చెప్పారు.
ఇదే సమయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమూ వీర్రాజుపై మాజీ పార్టీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ చేసిన వ్యాఖ్యలపై కూడా స్పందించారు. వాటిని తాము పట్టించు కోవడం లేదన్నారు. అంత ప్రయారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదని, పార్టీ అన్నాక అసంతృప్తులు సహజమని లైట్ తీసుకున్నారు.
ఇక వచ్చే ఎన్నికలకు సమయం ఉన్నా ఇప్పటి నుంచే చర్చలపై చర్చోప చర్చలు జరుగుతుండడం విశేషం. ఇదిలా ఉండగా బీజేపీ వైఖరిపై పవన్ కళ్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేయడం కలకలం రేపింది.
Also Read : జన హితమే జెండా సంక్షేమమే ఎజెండా