XI Jin Ping : చైనా ప్రెసిడెంట్ గా జిన్ పింగ్ ఎన్నిక

ముచ్చ‌ట‌గా మూడోసారి చీఫ్ గా రికార్డ్

XI Jin Ping : చైనా దేశ అధ్య‌క్షుడిగా మ‌రోసారి జిన్ పింగ్(XI Jin Ping) ఎన్నిక‌య్యారు. చైనా సుదీర్ఘ చ‌రిత్ర‌లో మావో త‌ర్వాత అత్య‌ధిక కాలం ముచ్చ‌ట‌గా మూడోసారి ఎన్నికై చ‌రిత్ర సృష్టించారు. వారం రోజుల పాటు విశ్వాస‌పాత్రుల స‌మావేశాన్ని ఏర్పాటు చేసింది. ఆదివారం జ‌రిగిన ఉన్న‌త స్థాయి సభ్యులు జిన్ పింగ్ అధ్య‌క్ష ప‌దవిని ఆమోదించారు.

మావో త‌ర్వాత దేశంలో అత్యంత ప్ర‌భావంత‌మైన నాయ‌కుడిగా త‌న స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. జిన్ పింగ్ మ‌ళ్లీ పాల‌క క‌మ్యూనిస్టు పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ఆవిష్కృతం కావ‌డం ఖాయం. ద‌శాబ్దాల త‌ర‌బ‌డి అధికార వ‌ర్గాల మ‌ధ్య అధికార భాగ‌స్వామ్య త‌ర్వాత దేశాన్ని నిర్ణ‌యాత్మ‌కంగా ఏక వ్య‌క్తి పాల‌న వైపు మ‌ళ్లించారు.

ఇదిలా ఉండ‌గా గ్రేట్ హాల్ ఆఫ్ పీపుల్ లో జ‌రిగిన ఊహించ‌ని చ‌ర్య‌లో మాజీ నాయ‌కుడు హు జింటావో ముగింపు వేడుక నుండి బ‌య‌ట‌కు వెళ్లి పోవ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. జిన్ పింగ్(XI Jin Ping) ప‌క్క‌నే కూర్చున్న ఆయ‌న సీటు నుండి వెళ్లి పోయేందుకు ఇష్ట ప‌డ‌ని స‌న్నివేశం వైర‌ల్ గా మారింది.

దీనిని తీవ్రంగా ఖండించింది చైనా. సెష‌న్ జ‌రుగుతున్న స‌మ‌యంలో ఆరోగ్యం బాగా లేదు. విశ్రాంతి కోసం స‌మావేశం వేదిక ప‌క్క‌నే ఉన్న గ‌దికి తీసుకు వెళ్లారు. ప్ర‌స్తుతం హుంటావో ఆరోగ్య ప‌రిస్థితి బాగానే ఉంద‌ని పేర్కొంది. ఈ విష‌యాన్ని ట్విట్ట‌ర్ వేదిక‌గా అధికారికంగా వెల్ల‌డించింది.

200 మంది సీనియ‌ర్లు కొత్త సెంట్ర‌ల్ క‌మిటీని ఎన్నుకున్నారు. స్టాండింగ్ క‌మిటీని ఇవాళ ఎన్నుకున్నారు.

Also Read : జిన్ పింగ్ రియల్ కింగ్

Leave A Reply

Your Email Id will not be published!