Rahul Gandhi : రాహుల్ ప్ర‌భంజ‌నం జ‌నం నీరాజ‌నం

తెలంగాణ‌లోకి ప్ర‌వేశించిన పాద‌యాత్ర

Rahul Gandhi : రాబోయే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీని తిరిగి ప‌వ‌ర్ లోకి తీసుకు వ‌చ్చేందు కోసం రాహుల్ గాంధీ చేప‌ట్టిన భార‌త్ జోడో యాత్ర‌కు భారీ స్పంద‌న ల‌భిస్తోంది. త‌మిళ‌నాడులోని క‌న్యాకుమారి నుంచి ప్రారంభ‌మైన ఈ యాత్ర కేర‌ళ‌, క‌ర్నాట‌క‌, ఏపీ రాష్ట్రాల‌లో పూర్తి చేసుకుంది.

ఆదివారం రాహుల్ గాంధీ భార‌త్ జోడో యాత్ర తెలంగాణ‌కు చేరుకుంది. క‌ర్ణాక‌ట‌లో ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న చేప‌ట్టిన యాత్ర రాయ‌చూర్ తో ముగిసింది. నారాయ‌ణ‌పేట జిల్లా మ‌క్త‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలోని కృష్ణాకు చేరుకుంది. ఈ సంద‌ర్భంగా వేలాది మంది రాహుల్ గాంధీకి(Rahul Gandhi) సాద‌ర స్వాగ‌తం ప‌లికారు. జేజేలతో హోరెత్తించారు. రాహుల్ గాంధీ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు.

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, మాజీ చీఫ్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌, సీనియ‌ర్ నాయ‌కులు గ్రాండ్ వెల్ క‌మ్ చెప్పారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి రాహుల్ గాంధీ ప్ర‌సంగించారు. దేశంలో అరాచ‌క పాల‌న సాగుతోంద‌న్నారు. ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డుతున్నా మోదీ ప‌ట్టించు కోవ‌డం లేదంటూ ఆరోపించారు.

ఇదిలా ఉండ‌గా ఇవాళ గూడె బ‌ల్లూరుతో పాద‌యాత్ర‌కు బ్రేక్ ప‌డుతుంది. అక్టోబ‌ర్ 27న ఉద‌యం ఇదే గూడె బ‌ల్లూరు నుంచి రాహుల్ గాంధీ భార‌త్ జోడో యాత్ర మ‌ళ్లీ ప్రారంభం అవుతుంది. 12 రోజుల పాటు ఈ యాత్ర తెలంగాణ‌లో సాగుతుంది. 19 అసెంబ్లీ, 7 లోక్ సభ నియోజ‌క‌వ‌ర్గాల‌తో క‌లిపి 375 కిలోమీట‌ర్ల మేర యాత్ర కొన‌సాగుతుంది.

26న ఖ‌ర్గే ప్ర‌మాణ స్వీకారోత్స‌వ కార్య‌క్ర‌మంలో రాహుల్ గాంధీ పాల్గొంటారు.

Also Read : జ‌న‌సేన‌తో స్నేహం టీడీపీతో పొత్తు పెట్టుకోం

Leave A Reply

Your Email Id will not be published!