Eknath Shinde : ప్ర‌ముఖ నేత‌ల‌కు భ‌ద్ర‌త తొలిగింపు – సీఎం

ప్ర‌క‌టించిన మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం

Eknath Shinde : మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. రాష్ట్రంలోని ప్ర‌ముఖ నాయ‌కుల‌కు ఇప్ప‌టి వ‌ర‌కు ఏర్పాటు చేసిన వ్య‌క్తిగ‌త భ‌ద్ర‌తను తొల‌గిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు అధికారికంగా మ‌రాఠా సీఎం ఏక్ నాథ్ షిండే(Eknath Shinde) విష‌యాన్ని వెల్ల‌డించారు. ప్ర‌ముఖ ప్ర‌తిప‌క్ష పార్టీగా వెలుగొందుతున్న నేష‌న‌లిస్ట్ కాంగ్రెస్ పార్టీ నేత‌లు అజిత్ ప‌వార్, దిలీప్ వాల్సే పాటిల భ‌ద్ర‌త‌ను తొల‌గించింది.

ప్ర‌స్తుతం ఈ నిర్ణ‌యం క‌ల‌క‌లం రేపింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ నేత‌ల‌కు ప్ర‌భుత్వం జెడ్ కేట‌గిరీ నుంచి వై ప్ల‌స్ కి త‌గ్గించింది. వీరితో పాటు ప‌లువురు నేత‌ల‌కు కూడా సెక్యూరిటీని తొల‌గిస్తున్న‌ట్లు స్ప‌ష్టం చేసింది. ఇక నేష‌న‌లిస్ట్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఉద్ద‌వ్ ఠాక్రేకు చెందిన సీనియ‌ర్ నాయ‌ల‌కు ఇప్ప‌టి వ‌ర‌కు ఏర్పాటు చేసిన భ‌ద్ర‌త ను తొల‌గించింది ప్ర‌భుత్వం.

మ‌రో వైపు ఎన్సీపీ సీనియ‌ర్ నేత‌ల‌కు కోలుకోలేని షాక్ ఇచ్చింది స‌ర్కార్. జెడ్ కేట‌గిరీ నుంచి వై ప్ల‌స్ కి తగ్గిస్తూ నిర్ణ‌యం తీసుకుంది. ఇదిలా ఉండ‌గా కావాల‌ని ప్ర‌తిప‌క్షాల‌ను ప్ర‌స్తుత షిండే, బీజేపీ ప్ర‌భుత్వం టార్గెట్ చేయ‌డం ప‌లు విమ‌ర్శ‌ల‌కు తావిచ్చింది.

ఎన్సీపీ నాయ‌కుల‌తో పాటు అనిల్ దేశ్ ముఖ్ , ఛ‌గ‌న్ భుజ్ బ‌ల్ , బాలా సాహెబ్ థోర‌ట్ , నితిన్ రౌత్ , నానా ప‌టోలే, జ‌యంత్ పాటిల్ , సంజ‌య్ రౌత్, విజ‌య్ వాడెట్టివార్ , ధ‌నంజ‌య్ ముండే, న‌వాబ్ మాలిక్ , న‌ర‌హ‌రి ఝిర్వాల్ , సునీల్ కేదార్ , అస్లాం షేక్ , అనిల్ ప‌ర‌బ్ , త‌దిత‌ర నేత‌ల‌కు పోలీసు భ‌ద్ర‌త‌ను త‌గ్గిస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది.

Also Read : ఒకే దేశం ఒకే పోలీస్ ఒకే యూనిఫాం – మోదీ

Leave A Reply

Your Email Id will not be published!