Arvind Kejriwal : మీ సీఎంను మీరే ఎన్నుకోండి – కేజ్రీవాల్
గుజరాత్ లో పిలుపునిచ్చిన ఆప్ చీఫ్
Arvind Kejriwal : మరో కొత్త నినాదంతో ముందుకు వచ్చారు ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ , ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal). త్వరలో గుజరాత్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 27 ఏళ్లుగా భారతయ జనతా పార్టీ అధికారంలో ఉంది ఇక్కడ. ఇక్కడి నుంచే సీఎంగా ఎన్నికైన నరేంద్ర దామోదర దాస్ మోదీ ఇవాళ దేశానికి ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
ప్రచారం పోటా పోటీగా సాగుతోంది. ఎలాగైనా సరే గుజరాత్ లో పాగా వేయాలని కంకణం కట్టుకున్నారు ఆప్ చీఫ్. ఈ మేరకు విస్తృతంగా పర్యటిస్తూ..ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. ఈసారి ఎలాగైనా సరే సామాన్యుడిదే రాజ్యాధికారం ఉంటుందన్నారు. మీ సీఎంను మీరే ఎన్నుకోవాలంటూ కొత్త నినాదానికి శ్రీకారం చుట్టారు అరవింద్ కేజ్రీవాల్.
ఇక పంజాబ్ లో ఒక్క చాన్స్ ఇవ్వండంటూ ఇచ్చిన పిలుపునకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రధాన పార్టీలు శిరోమణి అకాలీదళ్, కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలకు కోలుకోలేని షాక్ ఇచ్చింది. ఆప్ పంజాబ్ లో పవర్ లోకి వచ్చింది. శనివారం గుజరాత్ లో అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
ప్రజలు తమకు మేలు చేకూర్చే, తమ పనులను చేసి పెట్టే వారినే నాయకులుగా ఎన్నుకోవాలని కోరారు. ఈ సందర్బంగా డయల్ యువర్ సీఎం అనే టోల్ ఫ్రీ నంబర్ కూడా ఏర్పాటు చేశారు. అవినీతికి తావు లేని పారదర్శక పాలన అందజేస్తామని ప్రకటించారు.
ప్రతి ఒక్కరికీ ఉచితంగా విద్య, వైద్యం , ఉపాధి హామీ ఇవ్వడంతో మహిళా సాధికారత పై ఫోకస్ పెడతామని అన్నారు అరవింద్ కేజ్రీవాల్.
Also Read : ప్రముఖ నేతలకు భద్రత తొలిగింపు – సీఎం