Cash Gift Karnataka : జర్నలిస్టుల క్యాష్ గిప్ట్ ల కలకలం
పేసీఎం అంటూ కాంగ్రెస్ కామెంట్స్
Cash Gift Karnataka : కర్ణాటకలో జర్నిలస్టుల క్యాష్ గిఫ్టుల వ్యవహారం కలకలం(Cash Gift Karnataka) రేపుతోంది. ఇప్పటికే కమీషన్, కరప్షన్ కేరాఫ్ గా మారి పోయిందంటూ ఆరోపణలు ఉన్నాయి. దీపావళి పండుగ సందర్భంగా 12 మంది జర్నలిస్టులలో ముగ్గురు నగదు పంపిణీ చేసినట్లు ధృవీకరించారు. వారిలో ఇద్దరు జర్నలిస్టులు ఒక నివేదిక ప్రకారం సీఎం ఆఫీసుకు తిరిగి ఇచ్చినట్లు జోరుగా ప్రచారం జరిగింది.
మీడియా సలహాదారు సీఎం బస్వరాజ్ బొమ్మైకి వ్యతిరేకంగా ఓ బృందం ఫిర్యాదు చేసింది. ఇదిలా ఉండగా దీపావళి పండుగ రోజున సీఎం కార్యాలయానికి చెందిన అధికారి ఒకరు కొందరు జర్నలిస్టులకు స్వీటు బాక్సులతో పాటు రూ. లక్ష నుండి రూ. 2 లక్షల 50 వేల వరకు నగదు బహుమతులు ఇచ్చారని ఆరోపణలు వచ్చాయి.
ఈ మొత్తం వ్యవహారం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంపై పెద్ద దుమారం చెలరేగింది. ప్రతిపక్ష కాంగ్రెస్ సీఎంఓ స్వీట్ బాక్స్ లంచం అని పిలిచింది. దీనిపై వెంటనే విచారణను జరిపించాలని డిమాండ్ చేసింది. కాగా బీజేపీ ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. అవన్నీ నిరాధారమైన ఆరోపణలుగా కొట్టి పారేసింది.
మొత్తం 12 మందికి గిఫ్ట్ హ్యాంపర్లు అందుకున్నారు. వారిలో ముగ్గురు జర్నిలిస్టులు నగదు పంపిణీ చేసినట్లు ధ్రువీకరించారు. అయితే దీని గురించి పొక్కడంతో ఇద్దరు తిరిగి ఇచ్చేసినట్లు ఓ మీడియా సంస్థ వెల్లడించింది.
కాగా జర్నలిస్టులకు లంచం ఇచ్చేందుకు ప్రయత్నించినందుకు సీం బొమ్మై మీడియా సలహాదారుపై అవినీతి వ్యతిరేక కార్యకర్త కర్ణాటక లోకాయుక్త పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Also Read : రూల్స్ పాటించని అరబిక్ స్కూల్స్