150 Farmers Honoured : 150 మంది రైతులకు పంజాబ్ సత్కారం
కాలుష్య రహిత ప్రయత్నానికి పురస్కారం
150 Farmers Honoured : పంజాబ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే కొలువు తీరిన ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం కాలుష్యానికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చింది. రాష్ట్రంలో గత 5 సంవత్సరాలలో పంట అవశేషాలను కాల్చనందుకు గాను 150 మంది రైతులను గుర్తించింది.
ఆ మేరకు ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆదర్శ రైతులకు సన్మానం(150 Farmers Honoured) చేసింది. పంజాబ విధానసభ స్పీకర్ కుల్తార్ సింగ్ సంధ్వన్ ఆదర్శ ప్రాయమైన అన్నదాతలను సన్మానించింది. శనివారం జరిగిన అధికారిక కార్యక్రమంలో వీరిని సత్కరించింది. రైతులు పరిశుభ్రతను పాటించాలని , కాలుష్య రహితంగా ఉంచేందుకు పంట పొట్టును కాల్చవద్దంటూ పిలుపునిచ్చారు.
సర్కార్ ఇచ్చిన పిలుపుతో ఐదు సంవత్సరాల పాటు ఈ 150 మంది రైతులు తమ అనుభవాలను పంచుకున్నారు. తాము ఎలా పంటలను సాగు చేస్తున్నామో కూడా వివరించారు. పంజాబ్ లో కొన్నేళ్ల పాటు పంట అవశేషాలకు నిప్పు పెట్టకుండా ఉన్నందుకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రగతిశీల రైతులను సత్కరించినట్లు పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటన చేసింది.
పంట అవశేషాలను కాల్చడం వల్ల నేలపై పొరలో ఉన్న ఇతర సూక్ష్మజీవులకు నష్టం వాటిల్లుతుందని అలాగే దాని సేంద్రీయ నాణ్యతను దెబ్బ తీస్తుందని శ్రీ సంధ్యన్ చెప్పారు. ఈ సందర్భంగా పర్యావరణ శాఖ మంత్రి గుర్మీత్ సింగ్ మీట్ హయర్ మాట్లాడారు.
రైతులు పొట్టచేత కాల్చే పద్దతిని వదులు కోవడం సంతోషించ దగిన విషయమన్నారు. కాలుష్యం వల్ల ఊపిరితిత్తులు దెబ్బ తినడమే కాకుండా అనేక రకాల ఆరోగ్య వ్యాధులు తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read : జర్నలిస్టుల క్యాష్ గిప్ట్ ల కలకలం