KTR : బీజేపీ బండారం త్వరలో బట్టబయలు
దొంగలు ఎవరో దొరలు ఎవరో తేలుతుంది
KTR : రాష్ట్ర ఐటీ , పురపాలక శాఖ మంత్రి కేటీఆర్(KTR) షాకింగ్ కామెంట్స్ చేశారు. భారతీయ జనతా పార్టీ బండారం త్వరలోనే బయట పడడం ఖాయమన్నారు.
శనివారం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. తమ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, బీరం హర్ష వర్దన్ రెడ్డి, రేగా కాంతా రావు, పైలట్ రోహిత్ రెడ్డి లను ముగ్గురు వ్యక్తులు బేరసారాలు సాగించడం, కలకం రేపింది ఇరు తెలుగు రాష్ట్రాలలో.
ఇందులో ఒకరు స్వామీజీ మరొకరు ఢిల్లీకి చెందిన వారున్నారు. ఇక ఈ మొత్తం వ్యవహారంలో ఇరు పార్టీలు టీఆర్ఎస్, బీజేపీ మాటల తూటాలు పేల్చాయి. అంతే కాదు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ఏకంగా సీఎంకు సవాల్ విసిరారు. తాము ఎలాంటి చర్చలు జరుపలేదంటూ యాదగిరిగుట్ట గుడిలో ప్రమాణం చేశారు.
కానీ సీఎం రాలేదు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు కేటీఆర్(KTR) . త్వరలోనే బండారం బయట పడడం ఖాయమన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు తమ పని తాము చేసుకుంటూ పోతాయని పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రజలకు దొంగ ఎవరో దొర ఎవరో అర్థమైందన్నారు. దేశంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం లో ఇలాంటి చిల్లర రాజకీయాలు చేయడం మంచి పద్దతి కాదన్నారు.
తమకు చట్టం పట్ల నమ్మకం ఇప్పటకీ ఉందన్నారు. బీజేపీ నేతలు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. తాము విచారణ చేపట్టిన సంస్థల నివేదికల కోసం వెయిట్ చేస్తున్నామని చెప్పారు కేటీఆర్.
ఇవాళ బీజేపీ ఇచ్చిన ఏ హామీలు నెరవేర్చనందుకు గాను ఛార్జిషీట్ దాఖలు చేస్తున్నట్లు చెప్పారు కేటీఆర్.
Also Read : ఆపరేషన్ లోటస్ నిందితులు కస్టడీకి