RSS Postponed : ఆర్ఎస్ఎస్ త‌మిళ‌నాడు మార్చ్ వాయిదా

ప‌ర్మిష‌న్ కోసం పై కోర్టుకు వెళతాం

RSS Postponed : రాష్ట్రీయ స్వ‌యం సేవ‌క్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) (RSS Postponed) త‌మిళ‌నాడులో న‌వంబ‌ర్ 6న ఆదివారం త‌ల‌పెట్టిన మార్చ్ ను ర‌ద్దు చేసిన‌ట్లు ప్ర‌క‌టించింది. నిలిపి వేయాలంటూ కోర్టు ఆర్డ‌ర్ కేవియ‌ట్ విధించ‌డంపై స‌వాల్ చేస్తూ అప్పీలు చేయ‌నున్న‌ట్లు పేర్కొంది ఆర్ఎస్ఎస్.

మైదానం లేదా స్టేడియం వంటి స‌మ్మేళ‌న ప్రాంగ‌ణాల్లో మాత్ర‌మే మార్చ్ ల‌ను నిర్వ‌హించేందుకు మ‌ద్రాస్ హైకోర్టు అనుమ‌తి ఇచ్చింది. న‌గ‌రంలోని ఆరు మ‌త ప‌ర‌మైన సున్నిత‌మైన ప్ర‌దేశాల‌లో మార్చ్ కు కోర్టు ప‌ర్మిష‌న్ ఇచ్చేందుకు నిరాక‌రించింది. కాగా కోర్టు ఇచ్చిన ఆర్డ‌ర్ ఆమోద‌యోగ్యం కాద‌ని పేర్కొంది ఆర్ఎస్ఎస్.

కోర్టు ఇచ్చిన ఆర్డ‌ర్ స‌మంజ‌సంగా లేద‌ని తెలిపింది. దీనిని స‌వాల్ చేస్తూ తాము ఉన్న‌త స్థాయి కోర్టును ఆశ్ర‌యిస్తామ‌ని స్ప‌ష్టం చేసింది ఆర్ఎస్ఎస్. ఇదిలా ఉండ‌గా ఆర్ఎస్ఎస్ ఆధ్వ‌ర్యంలో త‌మిళ‌నాడు అంతటా 44 ప్ర‌దేశాల్లో లాంగ్ మార్చ్ లు చేప‌ట్టాల‌ని నిర్ణ‌యించింది.

దీనిపై స‌వాల్ చేస్తూ దాఖ‌లైన పిటిష‌న్ పై కోర్టు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. కేవ‌లం కొన్నిచోట్ల నిర్వ‌హించేందుకు మాత్ర‌మే అనుమ‌తి ఇచ్చింది. ఆర్ఎస్ఎస్ 50 ప్ర‌దేశాల‌లో మార్చ్ చేప‌ట్టేందుకు అనుమ‌తి కోరింది. దీనికి కోర్టు కేవ‌లం మూడింటిలో మాత్ర‌మే ఓకే చెప్పింది.

ఆర్ఎస్ఎస్ శాంతియుతంగా ర్యాలీలు లేదా మార్చ్ లు నిర్వ‌హించాల‌ని లేక‌పోతే తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని కోర్టు హెచ్చ‌రించింది.

అంత‌కు ముందు ఆర్ఎస్ఎస్ ర్యాలీకి త‌మిళ‌నాడు డీఎంకే ప్ర‌భుత్వం అనుమ‌తి నిరాక‌రించింది. దీనిని స‌వాల్ చేస్తూ మ‌ద్రాసు హైకోర్టును ఆశ్ర‌యించింది ఆర్ఎస్ఎస్. దీనిపై కోర్టు ఆర్డ‌ర్ కేవియ‌ట్ ఇచ్చింది.

Also Read : గుజ‌రాత్ లో కాంగ్రెస్ కు వ‌చ్చేవి 5 సీట్లే

Leave A Reply

Your Email Id will not be published!