Elon Musk Shock : ఉద్యోగులకు నో ఫుడ్ నో వైఫై – ఎలాన్ మస్క్
80 గంటల వారాలు పని చేయాల్సిందే
Elon Musk Shock : పిచ్చోడి చేతిలో రాయి లాగా మారింది ప్రస్తుత సోషల్ మీడియా దిగ్గజ సంస్థగా పేరొందిన ట్విట్టర్ పరిస్థితి. దిన దిన గండం అర్దాయుష్షు అన్న చందంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఉద్యోగులు. ఇప్పటికే టాప్ ఎగ్జిక్యూటివ్ లను తొలగించిన ఎలాన్ మస్క్ చివరకు బోర్డు డైరెక్టర్లపై కూడా వేటు వేశారు.
ఇప్పుడు మస్క్ ఒక్కడే ఏక్ నిరంజన్ . తాజాగా మరో సంచలన ప్రకటన చేశాడు. రిమోట్ వర్క్ ను ఒప్పుకోనని ప్రకటించాడు. ఆపై ఎవరైనా సరే ఏ స్థాయిలో ఉన్నా సరే ఆఫీసులకు రావాల్సిందేనని ఆదేశాలు జారీ చేశాడు. ఈ మేరకు ఉద్యోగులందరికీ ఇమెయిల్స్ ద్వారా సందేశం పంపించాడు.
నిన్నటి దాకా వారంలో 40 గంటలు పని చేయాల్సిందేనని చెప్పిన ఎలాన్ మస్క్ తాజాగా మాట మార్చాడు. 80 గంటల వారాలు విధిస్తున్నట్లు స్పష్టం చేశాడు. అంతే కాదు ట్విట్టర్లో గతంలో పని చేస్తున్న ఎంప్లాయిస్ కు అందరికీ ఉచితంగా ఆహారం, సెక్యూరిటీ, సెలవులు, వైఫై కల్పించే వారు. కానీ తాజాగా టేకోవర్ చేసుకున్న ఎలాన్ మస్క్(Elon Musk Shock) ఇవేవీ తాను కల్పించబోనంటూ హెచ్చరించారు.
ఇప్పటికే పాలన గాడి తప్పింది. సిఇఓలు లేరు. ఎగ్జిక్యూటివ్ లు గుడ్ బై చెప్పారు. ఆపై 7,500 మందికి గాను 3,978 మందిని తొలగించాడు. కొత్త బాస్ నిర్ణయాల కారణంగా ట్విట్టర్ లో దాదాపు $13 బిలియన్ల అప్పు అదనంగా చేరడం విస్తు పోయేలా చేసింది. కీలకమైన ఇద్దరు వ్యక్తులు తప్పుకున్నారు.
వారిలో ఒకరు యోమెల్ రోత్ కాగా మరొకరు రాబిన్ వీలర్. ఆమెను కూడా కొనసాగమని కోరాడు. కానీ తను ఒప్పుకోలేదు.
Also Read : ఎలాన్ మస్క్ చట్టానికి అతీతుడు కాదు