BCCI Selection : సెలెక్ష‌న్ క‌మిటీ నిర్వాకం జ‌ట్టుకు శాపం

ద్ర‌విడ్ మెత‌క‌ద‌నం ప‌రాజ‌యం ప‌రిస‌మాప్తం

BCCI Selection : కోట్లాది మంది ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లింది భార‌త జ‌ట్టు. దీని వెనుక ఎవ‌రినీ నిందించాల్సిన ప‌ని లేదు. ఎందుకంటే కోట్లాది రూపాయ‌ల వ్యాపారం, వాణిజ్యం టీమిండియాను న‌డిపిస్తోంది. ఇది అక్ష‌రాల వాస్త‌వం.

ఎవ‌రిని ఎంపిక చేయాల‌నేది కార్పొరేట్ లు ప్ర‌భావం చూపిస్తున్నాయ‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి. వీటిని ప‌క్క‌న పెడితే భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు సెలెక్ష‌న్ క‌మిటీ(BCCI Selection)  ఏం చేస్తుంద‌నే దానిపై ప్ర‌శ్న‌లు త‌లెత్తుతున్నాయి.

అడ‌పా ద‌డ‌పా విజ‌యాలు సాధిస్తున్నా ఆశించిన స్థాయిలో ప‌ర్ ఫార్మెన్స్ క‌న‌బ‌ర్చ‌డం లేద‌ని మాజీ ఆట‌గాళ్లు మండిప‌డుతున్నారు. బీసీసీఐ బాస్ గా ఉన్న దాదా త‌ప్పుకున్నాడు. 

ప్ర‌స్తుతం ఉన్న బీసీసీఐలో ఒక్క ప్రెసిడెంట్ రోజ‌ర్ బిన్నీ త‌ప్పా అంతా క్రికెట్ ఆడ‌ని వాళ్లే ఎక్కువ‌. ఒక ర‌కంగా బీసీసీఐ క్రికెట్ కు వేదిక కాకుండా బీజేపీ ఆఫీసుగా మారి పోయింద‌న్న విమ‌ర్శ‌లు ఉన్నాయి. ప్ర‌పంచంలో ఏ జ‌ట్టు చేయ‌న‌న్ని ప్ర‌యోగాలు చేసింది బీసీసీఐ.

ఇప్ప‌టి వ‌ర‌కు మూడు ఫార్మాట్ ల‌కు ఏడుగురు ఆట‌గాళ్ల‌ను కెప్టెన్లుగా ఎంపిక చేసింది. ఇక మాజీ ఆల్ రౌండ‌ర్ చేత‌న్ శ‌ర్మ సార‌థ్యంలోని భార‌త సెలెక్ష‌న్ క‌మిటీ ఆట‌గాళ్ల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటున్న తీరుపై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. 

ఫామ్ లోని లేని రిష‌బ్ పంత్(Rishab Pant) ను ఎందుకు ఎంపిక చేశారంటూ పెద్ద ఎత్తున సోష‌ల్ మీడియాలో నెటిజ‌న్లు ప్ర‌శ్నించారు.

ఆస్ట్రేలియా వేదికపై అద్భుత‌మైన ట్రాక్ రికార్డు క‌లిగిన సంజూ శాంస‌న్ ను(Sanju Samson) ఎందుకు ప‌క్క‌న పెట్టార‌ని నిల‌దీశారు. గ‌త్యంత‌రం లేక ఇత‌ర టూర్ల‌కు ఎంపిక చేశారు(BCCI Selection) . 

ఆస్ట్రేలియా వేదిక‌గా జ‌రిగిన టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో భార‌త జ‌ట్టులో వైఫ‌ల్యాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. ర‌విశాస్త్రి త‌ర్వాత హెడ్ కోచ్ గా ఎంపికైన ద్ర‌విడ్ అనుస‌రిస్తున్న మెత‌క వైఖ‌రి కూడా జ‌ట్టుకు శాపంగా మారింది.

మ‌రో వైపు మాజీ క్రికెట‌ర్ అజ‌య్ జ‌డేజా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. జ‌ట్టుకు ఒక్క కెప్టెన్ ఉండాలి. కానీ ఏడుగురు కెప్టెన్లు ఉంటే విజ‌యం సాధించ‌ద‌ని సెటైర్ వేశారు. 

టీమిండియాను క‌పిల్ దేవ్ న్యూ చోక‌ర్స్ అని పిల‌వాల‌ని కోరాడు. బుమ్రా, జ‌డేజా, శాంస‌న్ లేక పోవ‌డం కొట్టొచ్చిన‌ట్లు క‌నిపించింది జ‌ట్టులో. ఏ జ‌ట్టుకైనా ప‌వ‌ర్ ప్లే చాలా ముఖ్యం. వ‌స్తూనే అటాకింగ్ మొద‌లు పెట్టాల్సి ఉంది. కేఎల్ రాహుల్ , రోహిత్, కోహ్లీ అతి జాగ్ర‌త్త కొంప ముంచింది. 

మొద‌ట ఆడి సెమీస్ లో స‌త్తా మాత్ర‌మే చాటాడు హార్దిక్ పాండ్యా. ట్రాక్ రికార్డు బాగానే ఉన్నా యుజ్వేంద్ర చాహ‌ల్ ను ఆడించ‌లేదు. అక్ష‌ర్ ప‌టేల్ ను న‌మ్ముకుంటే కొంప ముంచాడు. పంత్ వ‌ర్సెస్ కార్తీక్ లో ఎవ‌రూ స‌త్తా చాట‌లేక పోయారు. చివ‌ర‌కు టెన్ష‌న్ కు లోనై నిరాశ ప‌రిచారు.

ఇక రాహుల్ ద్ర‌విడ్ మెత‌క వైఖ‌రి, పాత టెక్నిక్ ల ప్ర‌యోగం జ‌ట్టుకు శాపంగా మారింద‌న్న విమ‌ర్శ‌లు ఉన్నాయి. ఏది ఏమైనా సెలెక్ష‌న్ క‌మిటీ చైర్మ‌న్, బీసీసీఐ ఇక‌నైనా క‌ళ్లు తెర‌వాలి.

Also Read : రాహుల్ కు రెస్ట్ ల‌క్ష్మ‌ణుడికి ‘టెస్ట్’

Leave A Reply

Your Email Id will not be published!