CJI Chandrachud : న్యాయ వ్యవస్థలో మహిళల స్థానం ఎక్కడ
సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ షాకింగ్ కామెంట్స్
CJI Chandrachud : భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్(CJI Chandrachud) సంచలన వ్యాఖ్యలు చేయడం కలకలం రేపుతోది. ఆయన ప్రధానంగా న్యాయ వ్యవస్థపై నిప్పులు చెరిగారు. ఇంకా పాత కాలపు ఆలోచనా ధోరణితో కొనసాగుతోందని మండ్డిపడ్డారు. సమాజంలో సగ భాగంగా ఉన్న మహిళలకు మన వ్యవస్థలో ఏమైనా ప్రాధాన్యత ఉందా అని ప్రశ్నించారు.
ఇప్పటికీ సముచితమైన స్థానం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు సీజేఐ. హిందూస్థాన్ టైమ్స్ లీడర్ షిప్ సమ్మిట్ లో జస్టిస్ చంద్రచూడ్ ప్రసంగించారు. ఇప్పటికీ భూస్వామ్య ధోరణి కనిపించడం ప్రమాదకరమని పేర్కొన్నారు. ఇక్కడ ఉన్న వారే తమ వారిని ప్రమోట్ చేస్తున్నట్టుగా ఉంది.
ఇలా అయితే న్యాయ వ్యవస్థలో న్యాయం ఎలా అందుతుందని ప్రశ్నించారు జస్టిస్ చంద్రచూడ్. మహిళలతో పాటు కింది వర్గాల వారికి కూడా చోటు దక్కాల్సిన అవసరం ఉందన్నారు. లింగ సమానత్వం అన్నది తప్పక ఉండాలని అభిప్రాయం వ్యక్తం చేశారు సీజేఐ(CJI Chandrachud). సుప్రీంకోర్టులో కేసుల విచారణ అనేది టెలికాస్ట్ అవుతోంది.
ఇదే క్రమంలో హైకోర్టులు, జిల్లా స్థాయి కోర్టులలో కూడా ఈ విధానం అమలు చేస్తామన్నారు. ఇందులో భాగంగా ఇతర దేశాలలో కేసుల పరిష్కారం ఇండియాలో పరిష్కారం అవుతున్న కేసుల గురించి ప్రస్తావించారు. అమెరికాలో ఏడాదికి 180 కేసులు పరిష్కరిస్తే బ్రిటన్ లో 85 కేసులు విచారిస్తారని తెలిపారు.
కానీ సుప్రీంకోర్టులో సోమ, శుక్రవారాల్లో ఒక్క రోజే ఒక్కో న్యాయమూర్తి 80 కేసులు విచారిస్తున్నారని చెప్పారు జస్టిస్ చంద్రచూడ్.
Also Read : మంత్రి కామెంట్స్ స్మృతీ ఇరానీ సీరియస్