Arvind Kejriwal : ఉచిత విద్యుత్ కు కేంద్రం అడ్డంకి – కేజ్రీవాల్
బీజేపీపై నిప్పులు చెరిగిన ఢిల్లీ సీఎం
Arvind Kejriwal : ఢిల్లీ బల్దియా ఎన్నికల సమరం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ , కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు ప్రచార రంగంలోకి దూకాయి. ప్రస్తుతం దేశ రాజధానిలో అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) సారథ్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వం కొలువు తీరింది.
ఇక్కడ పవర్ లోకి రావాలని మోదీ త్రయం శతవిధాలుగా ప్రయత్నాలు చేసింది. కానీ ఓటమి పాలైంది. సంక్షేమ పథకాలతో పాటు మహిళలకు ప్రయారిటీ ఇవ్వడంతో ఈసారి కూడా ఆప్ కు పట్టం కట్టారు. ఆ తర్వాత లెఫ్టినెంట్ గవర్నర్లు, సీఎం మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది.
తాజాగా ఢిల్లీ లిక్కర్ స్కాం దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. డిప్యూ సీఎం మనీస్ సిసోడియాను సీబీఐ నిందితుడిగా పేర్కొంది. కానీ అరెస్ట్ చేయలేదు. మరో వైపు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న సత్యేంద్ర జైన్ మనీ లాండరింగ్ కు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో ఈడీ అరెస్ట్ చేసింది. ఆయనకు సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది.
ఈ సందర్భంగా ప్రచారంలో పాల్గొన్న అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) సంచలన వ్యాఖ్యలు చేశారు. తమను గెలిపిస్తేనే సంక్షేమ పథకాలు అమలు అవుతాయని అన్నారు. లేక పోతే కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ అడ్డంకులు సృష్టించేందుకు రెడీగా ఉందని ధ్వజమెత్తారు. ప్రస్తుతం ఢిల్లీ ప్రభుత్వం ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేస్తోందన్నారు.
ఒక వేళ కాషాయ దళానికి ఓటు వేస్తే ఇక మీ ఇష్టం అంటూ హెచ్చరించారు సీఎం. డిసెంబర్ 4న జరగబోయే ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే ఆప్ చేపట్టిన అభివృద్ది పనులన్నీ ఆగి పోతయాంటూ ఆరోపించారు. కొన్ని డంపింగ్ యార్డులు నిండి పోయాయి. చెత్త, వ్యర్థాల నిర్వహణ బీజేపీ బాధ్యత అన్నారు కేజ్రీవాల్.
Also Read : విద్వేష రాజకీయం దేశానికి ప్రమాదం