EX MP Mahabal Mishra : ఆప్ లో చేరిన కాంగ్రెస్ మాజీ ఎంపీ

ఢిల్లీ బ‌ల్దియా ఎన్నిక‌ల్లో కీల‌క ప‌రిణామం

EX MP Mahabal Mishra : కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని షాక్ త‌గిలింది. మాజీ ఎంపీ మ‌హాబ‌ల్ మిశ్రా(EX MP Mahabal Mishra) ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఢిల్లీ రాజ‌ధాని మ‌హాన‌గ‌ర పాల‌క సంస్థ ఎన్నిక‌ల వేళ ఆ పార్టీని వీడుతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఈ మేర‌కు ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ , ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ , డిప్యూటీ సీఎం మ‌నీష్ సిసోడియాల స‌మ‌క్షంలో ఆయ‌న ఆప్ లో చేరారు.

ఈ మేర‌కు సీఎం, డిప్యూటీ సీఎంలు మిశ్రాకు సాద‌ర స్వాగ‌తం ప‌లికారు. ఆప్ కండువా క‌ప్పి పార్టీలోకి ఆహ్వానించారు సీఎం. ఇదిలా ఉండ‌గా పూర్వాంచ‌ల్ క‌మ్యూనిటీకి చెందిన మ‌హాబ‌ల్ మిశ్రా డిసెంబ‌ర్ 4న జ‌ర‌గ‌నున్న ఎంసీడీ ఎన్నిక‌ల‌కు మ ఉందు ప‌హ‌ర్ గంజ్ లో జ‌రిగిన బ‌హిరంగ స‌భ‌లో పార్టీలో చేరారు.

ఈ సంద‌ర్భంగా సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ సంతోషం వ్య‌క్తం చేశారు. ఢిల్లీలోని పూర్వాంచ‌ల్ క‌మ్యూనిటీకి చెందిన ప్రముఖ నాయ‌కుడిగా ఉన్నారు మ‌హా బ‌ల్ మిశ్రా. ఆయ‌న గ‌త కొన్నేళ్లుగా ప్ర‌జా సేవ‌లో మునిగి పోయారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీని వీడారు. ఆమ్ ఆద్మీ పార్టీ ప్ర‌జ‌ల కోసం ప‌ని చేస్తుంద‌ని, ఇక్క‌డైతేనే తాను మ‌రింత సేవ‌లు అందించ గ‌ల‌న‌ని న‌మ్మార‌ని అన్నారు.

అత్యంత ప‌రిణ‌తి, అనుభ‌వం క‌లిగిన మ‌హాబ‌ల్ మిశ్రా(EX MP Mahabal Mishra) చేర‌డం వ‌ల్ల ఆమ్ ఆద్మీ పార్టీకి మ‌రింత బ‌లం చేకూరిన‌ట్ల‌యింద‌న్నారు సీఎం. ప్ర‌జ‌ల్లో, స‌మాజంలో మీకున్న అనుభ‌వంతో క‌లిసి దేశాన్ని ముందుకు తీసుకు వెళ‌తామ‌ని చెప్పారు అర‌వింద్ కేజ్రీవాల్. ఇదే స‌మ‌యంలో ఢిల్లీలో అభివృద్ది , సంక్షేమ ప‌నుల‌ను ఆపాల‌ని అనుకునే వారికి ఓటు వేయ‌వ‌ద్ద‌ని కోరారు.

Also Read : ఉచిత విద్యుత్ కు కేంద్రం అడ్డంకి – కేజ్రీవాల్

Leave A Reply

Your Email Id will not be published!