Shashi Tharoor : దేశంలో తొలి పురుష స్త్రీ వాది అంబేద్కర్
కాంగ్రెస్ అగ్ర నాయకుడు శశి థరూర్
Shashi Tharoor : కాంగ్రెస్ అగ్ర నాయకుడు, తిరువనంతపురం ఎంపీ శశి థరూర్(Shashi Tharoor) సంచలన వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలో తొలి పురుష స్త్రీ వాది ఎవరో కాదని ఆయన ఒక్కడే డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ అని కొనియాడారు. భారత రాజ్యాంగ పితామహుడు అంబేద్కర్ ఎంతో ముందు చూపుతో ఆలోచించారని అన్నారు.
మహిళలు బలవంతంగా పెళ్లి చేసుకోవద్దని ఆనాడే కోరారని చెప్పారు. ప్రతి ఒక్కరికి చదువు కోవడం అన్నది ప్రాథమిక హక్కు కావాలన్నారు. విద్య ఒక్కటే మనిషిని చేస్తుందన్నారు. వివాహం, ప్రసవం ధరించడం ఆలస్యం చేయాలని సూచించాడని అన్నారు. అందరికంటే భిన్నంగా ఆలోచించారని , అందుకే అంబేద్కర్ నేటికీ ప్రభావం చూపుతున్నారని ప్రశంసించారు శశిథరూర్.
ఒక రకంగా చెప్పాలంటే భారత దేశపు తొలి పురుష మహిళా వాది అనే బిరుదు ఇవ్వాల్సి వస్తే ఒక్క అంబేద్కర్ కు మాత్రమే ఇవ్వాల్సి ఉంటుందన్నారు. గోవా హెరిటే్ ఫెస్టివల్ లో థరూర్ తన తాజా పుస్తకం అంబేద్కర్ – ఎ లైఫ్ గురించి మాట్లాడారు. అంబేద్కర్ ఆలోచించిన స్త్రీ వాద ఆలోచనను నేటికీ సమాజం అంగీకరించ లేదన్నారు శశి థరూర్(Shashi Tharoor).
1920, 1930, 1940వ దశాబ్ధాల కాలంలో డాక్టర్ అంబేద్కర్ మహిళలకు సమాన హక్కులు ఉండాలని కోరుకున్నాడని ప్రస్తావించారు ఎంపీ. బాబా సాహెబ్ దళితులకే కాదు ఈ దేశంలోని ప్రజలందరికీ ఆదర్శ ప్రాయమైన నాయకుడని కితాబు ఇచ్చారు.
ప్రస్తుతం కేవలం దళిత నాయకుడిగా మాత్రమే చూసే ధోరణి ఉంది. ఆయన దేశంలోని ప్రధాన నాయకుడు అందరికీ అన్న స్పృహ ఉండాల్సిన అవసరం ఉందన్నారు శశి థరూర్.
Also Read : ఆప్ లో చేరిన కాంగ్రెస్ మాజీ ఎంపీ