Kane Williamson : చివరి మ్యాచ్ కు కేన్ మామ దూరం
అనారోగ్యం కారణంగా ఆడడం లేదు
Kane Williamson : హార్దిక్ పాండ్యా సారథ్యంలోని భారత జట్టు చేతిలో రెండో టి20 మ్యాచ్ ఘోరంగా ఓడి పోయింది న్యూజిలాండ్. ఇప్పటికే ఇరు జట్లు ఆస్ట్రేలియా వేదికగా జరిగిన ఐసీసీ టి20 వరల్డ్ కప్ లో సెమీ ఫైనల్ లో ఓటమి పాలయ్యాయి. పాకిస్తాన్ చేతిలో కీవీస్ 7 వికెట్ల తేడాతో ఓడి పోగా రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు ఏకంగా 10 వికెట్ల తో పరాజయం పాలైంది.
ఈ తరుణంలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను పక్కన పెట్టింది. అంతే కాదు మరో బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ ను కూడా తప్పించింది. మొత్తం యువ ఆటగాళ్లతో న్యూజిలాండ్ లో ఆడేందుకు ఎంపిక చేసింది.
ప్రస్తుతం మూడు టి20 మ్యాచ్ ల సీరీస్ లో మొదటి మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. రెండో టీ20లో భారత జట్టు 65 పరుగుల తేడాతో విజయం నమోదు చేసింది. ప్రధానంగా స్టార్ ప్లేయర్ సూర్య కుమార్ యాదవ్ 51 బంతులు ఆడి 111 పరుగులు చేసి దుమ్ము రేపాడు. అనంతరం బరిలోకి దిగిన కీవీస్ జట్టులో కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఒక్కడే రాణించాడు.
భారత బౌలర్లను ఎదుర్కొని 65 రన్స్ చేశాడు. ఆడుతున్న సమయంలో కేన్ మామ మోచేయి ఇబ్బంది పెట్టింది. దీంతో వెంటనే చికిత్స కోసం డాక్టర్ అపాయింట్ మెంట్ కోరాడు. ఆయనకు ఓకే చెప్పడంతో మూడో టి20 మ్యాచ్ కు కేన్ విలియమ్సన్ (Kane Williamson) దూరంగా ఉంటాడని కీవీస్ క్రికెట్ బోర్డు ప్రకటించింది.
Also Read : నారాయణ్ జగదీశన్ సెన్సేషన్