Supreme Court : కేంద్రానికి షాక్ సీఈసీ ఎంపిక‌పై సుప్రీం గుస్సా

పీఎంను ప్ర‌శ్నించే ద‌మ్మున్నోడు కావాలి

Supreme Court : సీజేఐ డీవై చంద్ర‌చూడ్ వ‌చ్చాక సుప్రీంకోర్టులో కీల‌క మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఆయ‌న రూటే సెప‌రేట్. పెండింగ్ లో ఉన్న కేసుల‌ను యుద్ద ప్రాతిప‌దిక‌న ప‌రిష్క‌రించేందుకు చ‌ర్య‌లు చేపట్టారు. తాజాగా కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప్యానెల్ స‌భ్యుల ఎంపిక‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది ఐదుగురు న్యాయ‌మూర్తుల‌తో కూడిన రాజ్యాంగ ధ‌ర్మాస‌నం.

కోర్టు చేసిన కామెంట్స్ దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌కు దారి తీశాయి. ప్ర‌స్తుతం ఇదే హాట్ టాపిక్ గా మారింది. సీఈసీ, ఇత‌ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ల ఎంపిక పార‌ద‌ర్శ‌కంగా లేదంటూ సుప్రీంకోర్టులో(Supreme Court) దాఖ‌లైన పిటిష‌న్ పై విచార‌ణ చేప‌ట్టింది. ఈ సంద‌ర్భంగా చేసిన వ్యాఖ్య‌లు అత్యంత ప్రాధాన్య‌త సంత‌రించుకున్నాయి. గ‌తంలో స‌మ‌ర్థ‌వంతంగా ఎన్నిక‌ల‌ను నిర్వ‌హించిన దివంగ‌త టీఎన్ శేష‌న్ లాంటి అధికారి కావాల‌ని స్ప‌ష్టం చేసింది.

ప్ర‌త్యేకించి ద‌మ్మున్నోడు కావాలంది. అంతే కాదు ప్ర‌ధాన‌మంత్రిని సైతం ప్ర‌శ్నించే ద‌మ్ము, ధైర్యం క‌లిగిన వారు ఉండాల‌ని కుండ బ‌ద్ద‌లు కొట్టింది ధ‌ర్మాస‌నం. ఈసీల నియామ‌కం స‌మ‌యంలో సీజేఐని కూడా సంప్ర‌దించాల‌ని స్ప‌ష్టం చేసింది. తాజాగా కేంద్రం నియ‌మించిన అరుణ్ గోయ‌ల్ నియామ‌కానికి సంబంధించిన ఫైల్ ను ఇవ్వాల‌ని ఆదేశించింది కోర్టు. సీఈసీ రాజ‌కీయ ప్ర‌లోభాల‌కు దూరంగా, స్వేచ్ఛ‌గా , స్వ‌తంత్రంగా న‌పి చేయాల‌ని స్ప‌ష్టం చేసింది.

ఎన్నిక‌ల క‌మిష‌న్ విష‌యంలో స‌మూల మార్పులు జ‌ర‌గాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అభిప్రాయ ప‌డింది. ఓ వైపు విచార‌ణ జ‌రుగుతుండ‌గా మ‌రో వైపు నియామ‌కం జ‌రిగింది. ఇవి రెండూ ఒక దానితో మ‌రొక‌టి సంబంధం క‌లిగి ఉండ‌వ‌చ్చ‌ని , అందుకే వివ‌రాలు ఇవ్వాల‌ని కోరామ‌ని పేర్కొంది కోర్టు. ఈ కేసు విచార‌ణ ఇవాళ కూడా కొన‌సాగ‌నుంది.

Also Read : ఎమ్మెల్యేల కొనుగోలు కేసు 30కి వాయిదా

Leave A Reply

Your Email Id will not be published!