Malla Reddy IT Notices : మల్లన్నతో పాటు డైరెక్టర్లకు నోటీసులు
28, 29 తేదీల్లో హాజరు కావాలని ఆదేశం
Malla Reddy IT Notices : ఇరు తెలుగు రాష్ట్రాలలో సంచలనం కలిగించింది తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డికి సంబంధించిన ఇళ్లు, ఆఫీసులపై ఆదాయ పన్ను శాఖ దాడులు చేయడం. మూడు రోజుల పాటు సోదాలు చేపట్టింది. ఏకంగా 200 మందితో 50 బృందాలుగా ఏర్పడి చుక్కలు చూపించారు.
ఆపై ఐటీ శాఖ అధికారులకు తోడుగా ఏకంగా కేంద్ర దళాలు రక్షణగా వచ్చాయి. మరో వైపు మల్లారెడ్డి మామూలోడు కాదని తేలి పోయింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 38 కాలేజీలు, 2 మెడికల్ కాలేజీలు, స్కూళ్లు, ఫంక్షన్ హాళ్లు, ఫామ్ హౌస్ లు, లెక్కించలేనన్ని భూములు, ఇలా చెప్పుకుంటూ పోతే మనోడి సామ్రాజ్యం నవాబ్ రాజులను మించి పోయింది.
విచిత్రం ఏమిటంటే ఐటీ దాడుల్లో ఐటీ ఆఫీసర్ రత్నాకర్ చెందిన ల్యాప్ టాప్ మాయం కావడం. తమ పిల్లలకు ఇంగ్లీష్ రాదని , కానీ రూ. 100 కోట్లు బ్లాక్ మనీ ఉన్నట్లు రాసుకున్నారని, తమతో భయపెట్టి సంతకాలు చేసుకున్నారంటూ ఆరోపించారు మంత్రి మల్లారెడ్డి.
మరో వైపు మంత్రికి సంబంధించిన 16 కాంపెనీల్లో తనిఖీల్లో కోట్లాది రూపాయలు హవాలో రూపంలో చేతులు మారినట్లు గుర్తించారు. ఆయా కంపెనీల్లో ఉన్న డైరెక్టర్లకు ఐటీ శాఖ నోటీసులు(Malla Reddy IT Notices) జారీ చేసింది. ఈనెల 28, 29 తేదీల్లో తమ ముందు అన్ని డాక్యుమెంట్లతో సహా హాజరు కావాలని ఆదేశించింది.
ఈ మేరకు ఐటీ శాఖ మనీ లాండరింగ్ కు సంబంధించి ఈడీకి లేఖ రాయనుంది. ఇదిలా ఉండగా ఈడీ రంగంలోకి దిగితే ఇంకెన్ని అక్రమాలు బయట పడతాయోనని గులాబీ శ్రేణులు బిక్కు బిక్కుమంటున్నాయి.
Also Read : అన్నదాతలకు జగనన్న తీపి కబురు