TS Govt Jobs : గ్రూప్ – 4 పోస్టుల భర్తీకి పచ్చ జెండా
9,168 పోస్టులు నింపేందుకు ఓకే
TS Govt Jobs : అసెంబ్లీ సాక్షిగా 82 వేల కొలువులు భర్తీ చేస్తామని ఆర్భాటంగా ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు ఒక్కరికి కూడా నియామక పత్రం ఇవ్వలేదు. ఇస్తారన్న నమ్మకం కూడా లేదు. గ్రూప్ -1 పరీక్ష నిర్వహించారు. దాని నిర్వహణపై ఆరోపణలు వెల్లువెత్తాయి. తాజాగా గ్రూప్ – 4 కు సంబంధించి పోస్టులను భర్తీకి తెలంగాణ ఆర్థిక శాఖ(TS Govt Jobs) క్లియరెన్స్ ఇచ్చింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. 9,168 ఉద్యోగాలను ఎంపిక చేసేందుకు ఓకే చెప్పింది.
ఇందులో అత్యధికంగా జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. వీటిలో రెవిన్యూ శాఖ, పంచాయతీరాజ్ శాఖలలో ఉన్నాయి. జూనియర్ అసిస్టెంట్ , జూనియర్ అకౌంటెంట్ , జూనియర్ ఆడిటర్ పోస్టులు కూడా ఉన్నాయి. ఇదిలా ఉండగా ఈ పోస్టులను అన్నింటిని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. ఆర్థిక శాఖ ఇచ్చిన ఉత్తర్వులను ట్విట్టర్ వేదికగా మంత్రి ట్వీట్ చేశారు. కొత్తగా వార్డు ఆఫీసర్లను కూడా చేర్చింది సర్కార్.
ఇక పోస్టుల వారీగా చూస్తే రెవెన్యూ శాఖలో 2,077 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఉండగా పంచాయతీరాజ్ శాఖలో 1,245 ఉద్యోగాలు ఉన్నాయి. వ్యవసాయ శాఖలో 44 , పశు సంవర్దక శాఖలో 2, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖలో 307 , పౌర సరఫరాల శాఖలో 72, ఎనర్జీలో 2, పర్యావరణం అండ్ అటవీ శాఖలో 23 పోస్టులు భర్తీ చేయనున్నారు.
అంతే కాకుండా ఆర్థిక శాఖలో 46, జేఏడీలో 5, హెల్త్ అండ్ మెడికల్ లో 338, ఉన్నత విద్యా శాఖలో 742, హోం శాఖలో 133, పరిశ్రమల శాఖలో 7, నీటి పారుదల శాఖలో 51, కార్మిక శాఖలో 128 పోస్టులు భర్తీ చేస్తారు. మైనార్టీ సంక్షేమ శాఖలో 191, పురపాలిక శాఖలో 601, ప్లానింగ్ లో 2, ఎస్సీ డెవలప్ మెంట్ శాఖలో 474 , సెకండరీ విద్యా శాఖలో 97, రవాణా శాఖలో 20, గిరిజన సంక్షేమ శాఖలో 221, స్త్రీ శిశు సంక్షేమ శాఖలో 18, యూత్ అడ్వాన్స్ మెంట్ లో 13 జేఏలు ఉన్నాయి.
ఇదిలా ఉండగా మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్ మెంట్ శాఖలో వార్డు ఆఫీసర్ పోస్టులు 1,862 , ఆర్థిక శాఖలో 429 జూనియర్ అకౌంటెంట్ పోస్టులు, 18 జూనియర్ ఆడిటర్ పోస్టులు ఉన్నాయి.
Also Read : గ్రూప్స్ లో మరిన్ని పోస్టులకు సర్కార్ ఓకే