IND vs NZ 3rd ODI : రాణించిన సుందర్..అయ్యర్
10 పరుగులకే పంత్ పరిమితం
IND vs NZ 3rd ODI : బీసీసీఐ తీరు మారలేదు. భారత జట్టు ఆట కూడా ఏమీ మారడం లేదు. మూడో వన్డేలో మరోసారి ఫామ్ లో ఉన్న కేరళ స్టార్ సంజూ శాంసన్ ను పక్కన పెట్టారు. ఎప్పటి లాగే తమకు నచ్చినా..ఎలాగూ ఆడక పోయినా కంటిన్యూగా రిషబ్ పంత్ ను తీసుకున్నారు. రెండో వన్డేలో పక్కన పెట్టిన సంజూను మూడో వన్డేలోకి తీసుకుంటారని భావించారు.
కానీ కెప్టెన్ ధావన్, కోచ్ లక్ష్మణ్ కక్ష కట్టారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే న్యూజిలాండ్ స్కిప్పర్ కేన్ మామ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో భారత జట్టు 47.3 ఓవర్లలో 219 పరుగులకే చాప చుట్టేసింది.
మరోసారి రాణిస్తాడని ఆశించిన రిషబ్ పంత్ పట్టుమని 10 పరుగులు చేసి ఇక ఆడలేనంటూ పెవిలియన్ బాట పట్టాడు. ఇక ఇప్పటికే తొలి వన్డేలో కీవీస్ గెలుపొందగా రెండో మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయ్యింది. ఇక సీరీస్ తేల్చే మూడో మ్యాచ్ లో టీమిండియా(IND vs NZ 3rd ODI) తక్కువ స్కోర్ కే పరిమితమైంది.
కీవీస్ బౌలర్లను ఆశించిన రీతిలో ఆడలేక పోయారు భారత కుర్రాళ్లు. మిడిల్ ఆర్డర్ లో శ్రేయస్ అయ్యర్ 49 రన్స్ చేస్తే ఆ తర్వాత వచ్చిన వాషింగ్టన్ సుందర్ 51 మినహా ఇంక ఏ ఆటగాడు ఆడలేదు.
శిఖర్ ధావన్ 27 రన్స్ చేస్తే గిల్ 13 పరుగులకు వెనుదిరిగారు. పంత్ 10 , సూర్య కుమార్ యాదవ్ 6 పరుగులే చేసి నిరాశ పరిచారు. ఇక దీపక్ చాహర్ , దీపక్ హూడా చెరో 12 పరుగులు చేశారు. న్యూజిలాండ్ బౌలర్లలో డారిల్ మిచెల్ 3 వికెట్లు తీస్తే సౌథీ 2 వికెట్లు పడగొట్టాడు.
Also Read : విమెన్ ఐపీఎల్ లో ఫ్రాంచైజీ ధర రూ. 400 కోట్లు