Harish Salve : ల‌క్ష్మ‌ణ రేఖ దాటిన కిరెన్ రిజిజు – సాల్వే

కేంద్ర ప్ర‌భుత్వం వ‌ర్సెస్ సుప్రీంకోర్టు

Harish Salve : కేంద్ర ప్ర‌భుత్వం సుప్రీంకోర్టు మ‌ధ్య ఆధిప‌త్య పోరు కొన‌సాగుతోంది. భార‌త దేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా ధ‌నంజ‌య వై చంద్ర‌చూడ్ కొలువు తీరాక మ‌రింత దూరం పెరుగుతోంది. దేశంలో ఏ వ్య‌వ‌స్థ ఎక్కువ అనే దాన్ని ప‌క్క‌న పెడితే ప్ర‌స్తుతం కొలీజియం వ్య‌వ‌స్థపై రాద్దాంతం చోటు చేసుకుంది.

కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా కేంద్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ గా అరుణ్ గోయ‌ల్(Arun Goyal) ను ఆగ‌మేఘాల‌పై నియ‌మించ‌డాన్ని స‌వాల్ చేస్తూ దాఖ‌లైన పిటిషన్ పై కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. ఒక ర‌కంగా చెప్పాలంటే ప్ర‌ధాన‌మంత్రి కొలువు తీరిన భార‌తీయ జ‌నతా పార్టీ సంకీర్ణ స‌ర్కార్ పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది ధ‌ర్మాస‌నం.

ఇదే స‌మ‌యంలో కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరెన్ రిజిజు సీరియ‌స్ కామెంట్స్ చేశారు కొలీజియం వ్య‌వ‌స్థ‌పై. ప్ర‌త్యేకించి న్యాయ వ్య‌వ‌స్థ‌పై, అందులో చోటు చేసుకున్న రాజ‌కీయాల‌పై. దీనిపై తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్త‌మైంది. తాజాగా ల‌క్ష్మ‌ణ రేఖ పూర్తిగా మంత్రి దాటారంటూ ప్ర‌ముఖ సీనియ‌ర్ న్యాయ‌వాది హ‌రీష్ సాల్వే(Harish Salve)  ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

ఆయ‌న కిరెన్ రిజిజుపై నిప్పులు చెరిగారు. దీంతో ప్ర‌స్తుతం కేంద్ర న్యాయ స్థానం , కేంద్ర ప్ర‌భుత్వం మ‌ధ్య మ‌రింత దూరం పెరిగిన‌ట్లు అర్థం అవుతోంది హ‌రీష్ సాల్వే ఇవాళ చేసిన ప్ర‌క‌ట‌న‌తో.

ఈ వివాదానికి ప్ర‌ధాన కార‌ణం కేంద్ర స‌ర్కార్ ను సుప్రీంకోర్టు నిల‌దీయ‌డం. కేంద్ర స‌ర్వీసులో ఉన్న అధికారికి ఆ వెంట‌నే వీఆర్ఎస్ ఇవ్వ‌డం, ఆపై కేవ‌లం 24 గంట‌ల లోపే ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ గా ఎలా నిర్వ‌హిస్తారంటూ నిల‌దీసింది. ఇదే వివాదానికి కార‌ణ‌మైంది.

Also Read : దేశం బాగుండాల‌ని పూజిస్తున్నా – రాహుల్

Leave A Reply

Your Email Id will not be published!