Kheyti Global Award : అంకుర కంపెనీకి అరుదైన పురస్కారం
తెలంగాణ స్టార్టప్ ఖేతికి రూ. 10 కోట్ల ప్రైజ్ మనీ
Kheyti Global Award : ఒక్క ఐడియా చాలు కోట్లు కొల్లగొట్టేందుకు. ప్రస్తుత ప్రపంచాన్ని అంకురాలు ప్రభావితం చేస్తున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే హల్ చల్ చేస్తున్నాయి. గతంలో కంటే ఎక్కువగా స్టార్టప్ లు కుప్పలు తెప్పలుగా పుట్టుకు వస్తున్నాయి.
సమాజానికి లేదా దేశానికి, మానవ సమూహానికి ఉపయోగపడేలా , సవాలక్ష సమస్యలకు పరిష్కారం చూపే విధంగా ఆలోచనలు ఉంటే చాలు. వాటికి పెద్ద ఎత్తున మార్కెట్ అనేది చేసుకోవచ్చు. పెట్టుబడి రాదేమోనన్న బెంగ కూడా అవసరం లేదు. ఎందుకంటే ఇన్వెస్ట్ చేసే వాళ్లు బోలెడు మంది ఉన్నారు.
ఇక కొత్తగా కొలువు తీరిన తెలంగాణ సర్కార్ పెద్ద ఎత్తున స్టార్టప్ లకు , ఔత్సాహికులకు ప్రోత్సాహం కల్పిస్తోంది. తాజాగా ఇదే ప్రాంతానికి చెందిన స్టార్టప్ కంపెనీ ఖేతి అరుదైన గౌరవాన్ని(Kheyti Global Award) దక్కించుకుంది. ఏకంగా రూ. 10 లక్షల పౌండ్లను గెలుచుకుంది. అంటే భారతీయ రూపాయల్లో రూ. 10 కోట్లు అన్నమాట.
వాట్ ఏ ఐడియా కదూ. బ్రిటన్ ప్రిన్స్ విలియమ్స్ ఏర్పాటు చేసిన ఎర్త్ షాట్ పోటీల్లో ఖేతి విజేతగా నిలిచింది. ఇందులో ఎన్నో కంపెనీలు పాల్గొన్నాయి. మొత్తం ఐదు కంపెనీలు టాప్ లో నిలిచాయి. అందులో భారత దేశంలోని తెలంగాణ ప్రాంతానికి చెందిన అంకుర సంస్థ ఖేతి చోటు దక్కించుకుంది.
ప్రకృతిని రక్షించడం తిరిగి పునరుద్దరించడం అనే విభాగంలో ఈ స్టార్టప్ అవార్డును పొందింది. ఈ ఖేతి ఏం చేస్తోందంటే గ్రీన్ హౌస్ షెల్టర్లను ఏర్పాటు చేస్తుంది. చిన్న రైతులను ఆ దిశగా పంట ఖర్చులను ఎలా తగ్గించు కోవాలో చూపిస్తుంది. అంతే కాదు ఆదాయం ఎలా పెంచు కోవాలో కూడా చూపిస్తుంది.
Also Read : ‘జక్కన్న’కు అరుదైన పురస్కారం