NV Ramana : సిరివెన్నెల పాటలతో ఉపశమనం
మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ
NV Ramana : మాజీ సీజేఐ నూతలపాటి వెంకట రమణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలుగు సాహిత్యం అత్యున్నతమైన స్థితిలో ఉందని, తెలుగు భాషను కాపాడు కోవాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రతి ఒక్కరు ఒత్తిడిని ఎదుర్కొంటారని, తాను వృత్తి పరంగా ఎన్నో ఒత్తిళ్లను ఎదుర్కొన్నానని ఆ సమయంలో దివంగత సినీ దిగ్గజ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి రాసిన పాటలను వింటూ ఉపశమనం పొందానని చెప్పారు. ఎందరో మహానుభావులు తెలుగు సినిమా పాటకు ప్రాణం పోశారని కొనియాడారు మాజీ సీజేఐ ఎన్వీ రమణ(NV Ramana).
తాను ప్రత్యేకించి సిరివెన్నెల పాటలు నిత్యం వింటూ గడిపానని అన్నారు. కొన్ని సందర్భాలలో కీలకమైన కేసుల విషయంలో నిద్ర కూడా పట్టేది కాదన్నారు. ఆ సమయంలో ఆయన పాటలు చల్లదనం కలిగించాయని ప్రశంసించారు. ఈ కీలక సమయంలో సిరివెన్నెల మన మధ్య లేక పోవడం బాధాకరమన్నారు.
ఆయన రాసిన పాటలు ఎల్లప్పటికీ చిరస్మరణీయంగా నిలిచి ఉంటాయని పేర్కొన్నారు. ప్రతి రోజూ సాహిత్యాన్ని చదువుతానని, వీలైనంత మేర మంచి పాటలు వింటూ గడుపుతానని తెలిపారు ఎన్వీ రమణ. విశాఖపట్నంలో తానా ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మాజీ సీజేఐ ఎన్వీ రమణ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సిరివెన్నెల సమగ్ర సాహిత్యం మూడు సంపుటాలను ఆయన ఆవిష్కరించారు. శ్రీశ్రీ, ఆరుద్ర, సినారే వంటి దిగ్గజాల తర్వాత తెలుగు భాషకు పేరు తీసుకు వచ్చిన వారిలో సిరివెన్నెల ఒకరని పేర్కొన్నారు ఎన్వీ రమణ(NV Ramana).
తెలుగు సాహిత్యం కోసం సినిమాలు చూడాలనే కోరికను తన పాటలతో తీసుకు వచ్చిన ఘనత సిరివెన్నెలదేనని కొనియాడారు. సాహితీ సభలు నిర్వహిస్తే తాను ఆర్థిక సాయం చేస్తానని స్పష్టం చేశారు.
Also Read : పోక్సో చట్టంపై సీజేఐ కీలక కామెంట్స్