Kobad Ghandy Row : సర్కార్ పై మరాఠా భాషా కమిటీ కన్నెర్ర
గాంధీ పుస్తకానికి అవార్డు వెనక్కి తీసుకోవడంపై
Kobad Ghandy Row : ప్రముఖ మావోయిస్టు లీడర్ కోబడ్ గాంధీ రాసిన పుస్తకం ఫ్రాక్చర్డ్ ఫ్రీడం – ఎ ప్రిజన్ మెమోయిర్ మరాఠీ అనువాదానికి ప్రకటించిన అవార్డును ప్రభుత్వం ఉపసంహరించుకుంది. దీనిపై పెద్ద ఎత్తున మహారాష్ట్రలో నిరసన వ్యక్తమైంది. తాజాగా రాజీనామాల పరంపర మహారాష్ట్ర సాహిత్య సంస్థను తాకడం విశేషం.
అవార్డు ఎంపిక కమిటీని కూడా సర్కార్ రద్దు చేయడంపై సాహితీవేత్తలు, భాషాభిమానులు మండిపడుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. కాగా కోబడ్ గాంధీ(Kobad Ghandy Row) మావోయిస్టు సిద్ధాంతకర్తగా పేరొందా. ఆయన జ్ఞాపకాల మారాఠీ అనువాదానికి పెద్ద ఎత్తున ఆదరణ లభించింది.
ప్రకటించిన అవార్డును ఉన్నట్టుండి శివసేన షిండే, బీజేపీ సర్కార్ వెనక్కి తీసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం అవుతోంది. దీనిని నిరసిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వ మరాఠీ భాషా కమిటీ చైర్మన్ తో పాటు నలుగురు సాహిత్య బోర్డు సభ్యులు తమ పదవులకు రాజీనామా చేశారు. దివంగత యశ్వంత రావు చవాన్ లిటరేచర్ అవార్డు -2021ని ప్రభుత్వం ఉపసంహరించుకుంది.
ఈ మేరకు కీలక ప్రకటన చేసింది. అంతే కాకుండా అవార్డు ఎంపిక కమిటీని కూడా రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. దీనిపై సాహిత్య అభిమానులు భగ్గుమంటున్నారు. డిసెంబర్ 6న ప్రభుత్వ మరాఠీ భాషా విభాగం అనఘా లేలేకు కోబాడ్ గాంధీ రాసిన పుస్తకానికి అనువాదం చేసినందుకు అవార్డును ప్రకటించింది.
కాగా కోబడ్ గాంధీకి మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న కారణంగా విమర్శలు వచ్చాయి. అవార్డును వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించడంతో దీనిని నిరసిస్తూ రచయిత, రాష్ట్ర ప్రభుత్వ భాషా సలహా కమిటీ చైర్మన్ లక్ష్మీకాంత్ దేశ్ ముఖ్ బుధవారం ప్రకటంచారు.
Also Read : సిబూ సోరేన్ కేసులో వాయిదాలు ఉండవు