Rishi Atul Rajpopat : సంస్కృత పజిల్ లో రాజ్ పోపట్ రికార్డ్
2,500 ఏళ్ల నాటి పజిల్ కు పరిష్కారం
Rishi Atul Rajpopat : ప్రతిష్టాత్మకమైన కేంబ్రిడ్జి యూనివర్శిటీలో చదువుకుంటున్న భారతీయ విద్యార్థి రాజ్ పోపట్ చరిత్ర సృష్టించాడు. యూనివర్శిటీలో 2,500 ఏళ్ల నాటి సంస్కృత పజిల్ కు పరిష్కారం చూపించాడు. అరుదైన ఘనతను స్వంతం చేసుకున్నాడు రాజ్ పోపట్. ఇదిలా ఉండగా కేంబ్రిడ్జ్ లోని సెయింట్ జాన్స్ కాలేజ్ లోని ఆసియాన్ , మిడిల్ ఈస్టర్న్ స్టడీస్ ఫ్యాకల్టీలో పీహెచ్ డి విద్యార్థిగా ఉన్నారు.
సంస్కృత భాషా మాస్టర్ పాణిని రాసిన వచనాన్ని డీకోడ్ చేసినట్లు యూనివర్శిటీ తెలిపింది. 5వ శతాబ్దం బీసీ నుండి పండితులను కలవరానికి గురి చేసిన సంస్కృత వ్యాకరణ సమస్యను ఎట్టకేలకు పరిష్కరించారు రాజ్ పోపట్(Rishi Atul Rajpopat). 27 ఏళ్ల రిషి అతుల్ పోపట్ . సుమారు రెండున్నర వేల సంవత్సరాల కిందట జీవించిన ప్రాచీన సంస్కృత భాషలో మాస్టర్ గా గుర్తింపు పొందారు పాణి.
ఆయన రాసిన వచనాన్ని డీకోడ్ చేసి విస్తు పోయేలా చేశాడు పోపట్. ఈ ఘనతకు సంబంధించి అమెరికాకు చెందిన ప్రసిద్ద సంస్థ ఇండిపెండెంట్ పేర్కొంది. మాస్టర్ పాణి ఒక మెటరూల్ ని బోధించాడు. దీనిని పండితులు సాంప్రదాయకంగా అర్థం చేసుకుంటారు.
సమాన బలంతో కూడిన రెండు నియమాల మధ్య వైరుధ్యం ఏర్పడితే వ్యాకరణం సీరియస్ క్రమంలో తర్వాత వచ్చే నియమం గెలుస్తుంది. అయతే వ్యాకరణ పరంగా తప్పు ఫలితాలకు దారి తీసింది. కాగా రాజ్ పోపట్ మాత్రం ఇది తప్పని నిరూపించాడు. పాణికి సంబంధించి భాషా యంత్రం దాదాపు మినహాయింపులు లేకుండా వ్యాకరణ పరంగా సరైన పదాలను ఉత్పత్తి చేసిందని ముగించాడు పోపట్.
Also Read : హార్వర్డ్ యూనివర్శిటీ చీఫ్ గా క్లాడిన్ గే