Hyderabad Book Fair : 22 నుంచి పుస్తక మహోత్సవం
పుస్తక ప్రియులకు పండగే పండుగ
Hyderabad Book Fair : టెక్నాలజీ పెరిగినా పుస్తకాలపై ఆసక్తి జనాలకు తగ్గడం లేదు. పుస్తకాలు జీవితాన్ని ఇస్తాయి. అంతకంటే కష్టాల్లో ఉన్న సమయంలో భరోసా కల్పిస్తాయి. ప్రతి ఏటా హైదరాబాద్ మహా నగరంలో పుస్తక ప్రియుల కోసం ప్రత్యేకంగా పుస్తక మహోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
దీనిని డిసెంబర్ 22 నుంచి బుక్ ఎగ్జిబిషన్ ను ప్రారంభించనున్నారు. దాదాపు 9 రోజుల పాటు పుస్తక ప్రియులను అలరించనుంది. చిన్నారుల నుంచి పెద్దల దాకా ఇక్కడ పుస్తకాలు కొనుగోలు చేసేందుకు వీలు కలుగుతుంది. ఈ పుస్తకాల పండుగ 2023 జనవరి 1 దాకా కొనసాగుతుంది.
ఇందుకు సంబంధించి నిర్వాహకులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సారి పుస్తక మహోత్సవంలో 300 స్టాళ్లను ఏర్పాటు చేయనున్నారను. దాదాపు 10 లక్షలకు పైగా పుస్తకాలు ఇందులో ప్రదర్శిస్తారు.
పుస్తకాలను ప్రేమించే వారికి, వాటిని చదివే వారికి, వాటిని స్పూర్తిగా తీసుకునే వారికి, రచయితలు, కవులు, కళాకారులు, ఇలా అన్ని రంగాలకు చెందిన వారందరికీ ఇది అద్భుతమైన వేదికగా ఉపయోగ పడుతుందనడంలో సందేహం లేదు.
ఈ పుస్తకాల మహోత్సవాన్ని హైదరాబాద్ బుక్ ఫెయిర్ సొసైటీ (Hyderabad Book Fair) నిర్వహిస్తోంది. ఈ మహోత్సవంలో తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ, మరాఠీ, తమిళం, తదితర భాషలకు చెందిన పుస్తకాలు ఇక్కడ కొలువు తీరనున్నాయి.
ఇందులో ప్రధానంగా బాల సాహిత్యం, అభ్యుదయ, పురాణ సాహిత్యం తో పాటు నవలలు, కథలు, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన పుస్తకాలు అందుబాటులో ఉంటాయి.
ఇటీవల ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి నోటిఫికేషన్లు రిలీజ్ చేయడంతో పెద్ద ఎత్తున పోటీ పరీక్షలకు సంబంధించి పుస్తకాలు కూడా దొరుకుతాయి.
Also Read : ఐర్లాండ్ ప్రధానిగా లియో వరాద్కర్