Bilkis Bano Case : బిల్కిస్ కు షాక్ రివ్యూ పిటిష‌న్ కొట్టివేత

సుప్రీంకోర్టు సంచ‌ల‌న నిర్ణ‌యం

Bilkis Bano Case : దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం రేపిన బిల్కిస్ బానో(Bilkis Bano Case) కేసుకు సంబంధించి దాఖ‌లు చేసిన రివ్యూ పిటిష‌న్ ను స‌ర్వోన్న‌త న్యాయ స్థానం సుప్రీంకోర్టు కొట్టి వేసింది. 2002లో బిల్కిస్ ను సామూహిక అత్యాచారం చేసి, చిన్నారిని, కుటుంబీకుల‌ను దారుణంగా హ‌త్య చేసిన ఘ‌ట‌న‌లో 11 మందిని దోషిగా తేల్చింది కోర్టు.

శిక్ష అనుభ‌విస్తున్న జీవిత ఖైదీల‌ను ఈ ఏడాది ఆగ‌స్టు 15న కేంద్రం స‌హ‌కారంతో గుజ‌రాత్ ప్ర‌భుత్వం విడుద‌ల చేసింది. ఇందుకు సంబంధించి వారి స‌త్ ప్ర‌వ‌ర్త‌న బాగుంద‌ని అందుకే విడుద‌ల చేశామ‌ని వెల్ల‌డించింది. ఈ సంద‌ర్భంగా జీవిత ఖైదీల‌ను విడుద‌ల చేయడాన్ని స‌వాల్ చేస్తూ బిల్కిస్ బానో సుప్రీంకోర్టులో రివ్యూ పిటిష‌న్ దాఖ‌లు చేసింది.

ప‌లుమార్లు జాబితా చేసినా శ‌నివారం విచార‌ణ చేప‌ట్టింది ధ‌ర్మాస‌నం. దీనిని కొట్టి వేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించ‌డం విస్తు పోయేలా చేసింది. 2002లో గుజ‌రాత్ లో గోద్రా రైలు ద‌హ‌నం ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఈ అల్ల‌ర్ల‌లో పారి పోయేందుకు ప్ర‌య‌త్నం చేసిన బిల్కిస్ బానో(Bilkis Bano Case) దారుణంగా అత్యాచారానికి గురైంది.

ఆనాడు ఆమె వ‌య‌స్సు 21 ఏళ్లు. అంతే కాదు ఐదు నెల‌ల గ‌ర్భిణీగా ఉంది. ఆ స‌మ‌యంలో మూడేళ్ల కూతురు కూడా ఉంది. చిన్నారి అని కూడా చూడ‌కుండా హ‌త్య చేశారు. ఈ ఘ‌ట‌న‌లో దోషుల‌కు శిక్ష ప‌డింది. జీవిత ఖైదు విధించినా ఎందుకు విడుద‌ల చేశారంటూ పిటిష‌న్ దాఖ‌లు చేసింది.

ఇందుకు సంబంధించి గుజ‌రాత్ స‌ర్కార్ అఫిడ‌విట్ దాఖ‌లు చేసినా ఫ‌లిత లేక పోయింది.

Also Read : కాశీ..త‌మిళ‌నాడు బంధం మోదీ బ‌లోపేతం

Leave A Reply

Your Email Id will not be published!