Kiren Rijiju : తవాంగ్ సరిహద్దులో రిజిజు హల్ చల్
భారత ఆర్మీ జవాన్లతో ములాఖత్
Kiren Rijiju : కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరెన్ రిజిజు వైరల్ గా మారారు. తాజాగా అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దు వద్ద చోటు చేసుకున్న ఉద్రిక్తతపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శనివారం కేంద్ర మంత్రి సరిహద్దును సందర్శించారు. ఈ సందర్భంగా భారత ఆర్మీ జవాన్లతో ములాఖత్ అయ్యారు.
ఈ సందర్భంగా తమ ప్రభుత్వంపై, ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై సీరియస్ కామెంట్స్ చేసిన కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీపై మండిపడ్డారు. ఆయనకు దేశం పట్ల అవగాహన లేదన్నారు. తాము ఏ దేశంతోనైనా యుద్దం చేసేందుకు సిద్దంగా ఉన్నామని చెప్పారు. తవాంగ్ సరిహద్దు వద్ద తాను పర్యటించిన తర్వాత అక్కడంతా బాగానే ఉందన్నారు.
ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు అక్కడ లేవని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా కిరణ్ రిజిజు(Kiren Rijiju) పంచుకున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. తమ వారిపై దాడి చేసే సత్తా చైనాకు లేదని పేర్కొన్నారు కిరెన్ రిజిజు. దీనిని ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గుర్తించక పోవడం దారుణమన్నారు.
ఇందులో భాగంగా తాను భారత ఆర్మీ ప్రదర్శించిన ధైర్య సాహసాలను తాను ప్రశంసిస్తున్నానని పేర్కొన్నారు. ఈ దేశం యావత్తు జవాన్లకు రుణపడి ఉందని స్పష్టం చేశారు. భారత సైన్యం లోని వీర జవాన్లను తగినంతగా మోహరించడం వల్ల తవాంగ్ లోని యాంగ్ట్సే ప్రాంతం ఇప్పుడు పూర్తిగా సురక్షితంగా ఉందన్నారు కిరెణ్ రిజిజు.
కేంద్ర మంత్రి రాహుల్ పై చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి.
Also Read : గాల్వాన్ లేదా తవాంగ్ ఏదైనా సరే