CJI DY Chandrachud : ప్రజల హక్కులకు ‘సుప్రీం’ భరోసా
స్పష్టం చేసిన సీజేఐ చంద్రచూడ్
CJI DY Chandrachud : భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయమూర్తి ధనంజయ వై చంద్రచూడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ దేశంలో ప్రజల హక్కులను కాపాడటంలో కీలకమైన పాత్ర సుప్రీంకోర్టు పోషిస్తోందని చెప్పారు. దేశంలో పౌరుల స్వేచ్ఛకు న్యాయ స్థానాలే రక్షకులని స్పష్టం చేశారు సీజేఐ.
అన్ని వ్యవస్థలు నిర్వీర్యమైన సమయంలో న్యాయ వ్యవస్థపై జనానికి నమ్మకం ఏర్పడిందన్నారు. ఇప్పటికీ తమ వద్దకు వస్తే న్యాయం లభిస్తుందన్న నమ్మకం ప్రజల్లో ఏర్పడిందన్నారు. ముంబైలోని చవాన్ సెంటర్ లో జరిగిన సమావేశంలో సీజేఐ చంద్రచూడ్ పాల్గొని ప్రసంగించారు.
ఇదే సమయంలో దేశంలో న్యాయ వ్యవస్థపై జనం భారీగా ఆశలు పెట్టుకున్నారని దానిని కాపాడు కోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు సీజేఐ. ఇదే సమయంలో బార్ అసోసియేషన్ సభ్యులు నిర్భయంగా పని చేయాలని సూచించారు. దీని వల్ల ఎందరికో మేలు జరుగుతుందన్నారు.
దేశంలో ఇప్పటి వరకు భారీ ఎత్తున కేసులు పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు. సాధ్యమైనంత త్వరగా వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తామని చెప్పారు డీవై చంద్రచూడ్(CJI DY Chandrachud).
ఇటీవల వెలువరించిన తీర్పులు దేశ ప్రజలను ఎంతగానో ప్రభావితం చేశాయని తెలిపారు. ఇప్పటికీ న్యాయం కావాలంటే లేదా దక్కాలంటే కోర్టులే బెటర్ అన్న స్థితికి వచ్చారని అన్నారు. ఏది ఏమైనా తీర్పు చెప్పే సమయంలో న్యాయమూర్తులు సంయమనంతో ఉండడం చాలా కీలకమన్నారు.
న్యాయ వ్యవస్థలో చాలా ఖాళీలు ఉన్నాయని వాటిని భర్తీ చేయగలిగితే సాధ్యమైనంత త్వరగా కేసులను పరిష్కరించేందుకు వీలు కలుగుతుందన్నారు డీవై చంద్రచూడ్ .
Also Read : ఇదేనా న్యాయం తీరని అన్యాయం