CJI Chandrachud : ప్రేమ కోసం మరణిస్తున్నారు – సీజేఐ
ఆవేదన వ్యక్తం చేసిన చంద్రచూడ్
CJI Chandrachud : భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేవలం ప్రేమ కోసం వందలాది మంది మరణిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉందన్నారు. కేవలం ప్రేమించడం కోసం ఏటా ప్రాణాలు కోల్పొవడం బాధాకరమన్నారు జస్టిస్ చంద్రచూడ్(CJI Chandrachud).
భారత రాజ్యాంగం ప్రజల కోసం రూపొందించబడింది కాదు. కానీ వారు ఎలా ఉండాలి అనే దానిని దిశా నిర్దేశనం చేస్తుందన్నారు. ఈ దేశంలో వందలాది మంది యువకులు పరువు హత్యల కారణంగా మరణిస్తున్నారని వెల్లడించారు జస్టిస్ చంద్రచూడ్.
వారు ఎవరినైనా ప్రేమించడం వల్ల లేదా వారి కులం వెలుపల లేదా వారి కుటుంబ ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్లి చేసుకోవడం కారణంగా ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని పేర్కొన్నారు సీజేఐ చంద్రచూడ్.
స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించే సెక్షన్ 377 , ముంబైలో బార్ డ్యాన్స్ లపై నిషేధం, వ్యభించారం వంటి అనేక కేసులను ఈ సందర్బంగా ప్రస్తావించారు సీజేఐ ధనంజయ వై చంద్రచూడ్(CJI Chandrachud). ఆధిపత్య సమూహాలు బలహీన వర్గాలను అధిగమించి ప్రవర్తనా నియమావళిని , నైతికతను నిర్ణయిస్తాయని అన్నారు.
తమ మనుగడ కోసం ఆధిపత్య సంస్కృతికి లొంగి పోవడం తప్ప వేరే మార్గం లేదన్నారు. అణచివేత సమూహాల చేతిలో అవమానం, వేర్పాటు కారణంగా సమాజంలోని బలహీనవర్గాలు ప్రతివాద సంస్కృతిని సృష్టించలేక పోతున్నాయని ఆవేదన చెందారు.
బలహీన వర్గాలను సామాజిక నిర్మాణంలో దిగువన ఉంచారని ఆవేదన వ్యక్తం చేశారు. నాకు ఏది నీతిగా ఉందో అది నీకు నీతిగా ఉండాల్సిన అవసరం ఉందా అని ప్రశ్నించారు.
Also Read : ప్రజల హక్కులకు ‘సుప్రీం’ భరోసా