Govind Singh Rajput : క‌మ‌ల్ నాథ్ కంటే డిగ్గీ రాజా బెట‌ర్

మంత్రి గోవింద్ రాజ్ సింగ్ రాజ్ పుత్

Govind Singh Rajput : మ‌ధ్య‌ప్ర‌దేశ్ మంత్రి రాజ్ సింగ్ రాజ్ పుత్ షాకింగ్ కామెంట్స్ చేశారు. బ‌లం ఉన్న‌ప్ప‌టికీ కాంగ్రెస్ పార్టీ ప‌వ‌ర్ కోల్పోవ‌డం విస్తు పోయేలా చేసింది. ఇదే స‌మ‌యంలో త్వ‌ర‌లో మ‌ధ్య ప్ర‌దేశ్ రాష్ట్రంలో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. గుజ‌రాత్ మోడ‌ల్ ను ఇక్క‌డ అమ‌లు చేయాల‌ని చూస్తోంది బీజేపీ.

ఇదిలా ఉండ‌గా ఆ పార్టీకి చెందిన రాజ్ సింగ్ రాజ్ పుత్(Govind Singh Rajput) ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. క‌మ‌ల్ నాథ్ వ‌ల్ల‌నే పార్టీ ప‌వ‌ర్ లోకి రాలేద‌న్నారు. అదే గ‌నుక దిగ్విజ‌య్ సింగ్ గ‌నుక అధికారంలో ఉంటే తాము ప‌వ‌ర్ లోకి రాక పోయి ఉండే వార‌మ‌న్నారు. ఎందుకంటే వ్యూహాలు ప‌న్న‌డంలో డిగ్గీ రాజా ప‌వ‌ర్ ఫుల్ అని పేర్కొన్నారు. క‌మ‌ల్ నాథ్ వ‌ల్ల పార్టీకి న‌ష్టం త‌ప్ప లాభం లేద‌న్నారు.

ఇదిలా ఉండ‌గా బీజేపీకి చెందిన మంత్రి కాంగ్రెస్ పార్టీపై కామెంట్స్ చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. 2020లో కాంగ్రెస్ ప్ర‌భుత్వం కూలి పోయింది. వ‌చ్చే ఏడాది 2023లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి రాష్ట్రంలో. ఒక‌వేళ ఆ స‌మ‌యంలో ప‌వ‌ర్ లో గ‌నుక దిగ్విజ‌య్ సింగ్ ఉంటే సీన్ వేరేలా ఉండేద‌న్నారు రాజ్ సింగ్ రాజ్ పుత్.

రెండేళ్ల కింద‌ట క‌మ‌ల్ నాథ్ సీఎం ప‌ద‌వికి రాజీనామా చేయ‌డం, జ్యోతిరాదిత్యా సింధియా త‌న విధేయుల‌తో క‌లిసి గ్రాండ్ ఓల్డ్ పార్టీ నుండి నిష్క్ర‌మించారు. దీంతో ఇక్క‌డ శివ‌రాజ్ సింగ్ చౌహాన్ సార‌థ్యంలో బీజేపీ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసింది. తాజాగా జ‌రిగిన ఎన్నిక‌ల్లో గుజ‌రాత్ లో ప‌వ‌ర్ లోకి బీజేపీ రాగా హిమాచ‌ల్ ప్ర‌దేశ్ లో త‌న అధికారాన్ని కోల్పోయింది.

ఈ త‌రుణంలో బీజేపీ మంత్రి చేసిన వ్యాఖ్య‌లు హాట్ టాపిక్ గా మారాయి.

Also Read : ఆజాద్ పార్టీ కార్య‌వ‌ర్గం రిలీజ్

Leave A Reply

Your Email Id will not be published!