Sundar Pichai : ఏ భాష లోనైనా సెర్చ్ చేయొచ్చు
స్పష్టం చేసిన గూగుల్ సిఇఓ
Sundar Pichai : ప్రపంచ వ్యాప్తంగా ఏ సమాచారం కావాలన్నా సెకండ్లలో కళ్ల ముందు తీసుకు వచ్చే అద్భుత సాధనం టెక్ దిగ్గజం గూగుల్. మరో వైపు మైక్రో సాఫ్ట్ సైతం గూగుల్ కు పోటీగా సెర్చ్ ఇంజన్ ను తీసుకు వస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే టాప్ సెర్చింగ్ ఇంజన్లుగా పేరొందిన రీడిఫ్, యాహూ లాంటివి అడ్రస్ లేకుండా పోయాయి గూగుల్ కొట్టిన దెబ్బకు.
ఇప్పుడు ఏది కావాలన్నా గూగుల్ ను ఆశ్రయిస్తున్నారు. దానిలో సెర్చ్ చేస్తున్నారు. దానితోనే సహ జీవనం చేస్తున్నారు. అంతలా గూగుల్ తో కనెక్ట్ అయ్యారు. తాజాగా మరో కీలక ప్రకటన చేశారు గూగుల్ సిఇఓ సుందర్ పిచాయ్(Sundar Pichai) . ఆయన భారత్ లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
సాంకేతిక భారత దేశంలో పురోగతిలో ఉందన్నారు. త్వరలో గూగుల్ లో మరికొన్ని కొత్త ఫీచర్స్ తీసుకు వస్తున్నట్లు వెల్లడించారు . 100కి పైగా భారతీయ భాషల్లో టెక్ట్స్ (పదాలు ) , మాట (వాయిస్ ) ద్వారా ఇంటర్నెట్ లో కావాల్సిన అంశాలు వెతికేందుకు గాను తాము ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు గూగుల్ సిఇఓ.
ఇందు కోసం కృత్రిమ మేధను ఉపయోగిస్తామన్నారు. గూగుల్ ఫర్ ఇండియా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రపంచంలో మాట్లాడే 1,000 భాషలను అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు.
ఇక దేశీయంగా 100 భాషలను వినియోగించేలా చూస్తామన్నారు. తమ భాషలో సమాచారాన్ని, జ్ఞానాన్ని పొందేలా చేయాలన్నదే తమ లక్ష్యమని స్పష్టం చేశారు సుందర్ పిచాయ్(Sundar Pichai) .
Also Read : భారత్ లో సాంకేతిక పురోగతి సూపర్