#RelianceJio : బ్రాండ్ బెస్ట్ లో వీ చాట్ ఫ‌స్ట్.. జియో ఐదో ప్లేస్

స‌త్తా చాటిన రిల‌య‌న్స్

Reliance Jio : ప్ర‌పంచంలో అత్యంత శ‌క్తివంత‌మైన బ్రాండ్లు ఏవి అనే దానిపై జ‌రిపిన స‌ర్వేలో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు వెలుగు చూశాయి. ఓ వైపు డ్రాగ‌న్ చైనాపై అమెరికా ఆంక్ష‌లు విధించిన నేప‌థ్యంలో ఊహించ‌ని రీతిలో అదే దేశానికి చెందిన వీ చాట్ యాప్ 95.4 పాయింట్ల‌ను సాధించి వ‌ర‌ల్డ్ లోనే టాప్ వ‌న్ గా నిలిచి విస్తు పోయేలా చేసింది.

అమెరికాకు చెందిన కోకోకోలా కంపెనీ నాలుగో ప్లేస్ లో నిల‌వ‌గా అనూహ్యంగా ప్ర‌పంచ కుబేరుల వంద జాబితాలో చేరిన ఇండియ‌న్ బిలియ‌నీర్ రిల‌య‌న్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఛైర్మ‌న్ కు చెందిన అతి పెద్ద టెలికాం కంపెనీ జియో ఐదో స్థానం పొందింది. ఈ ప్లేస్ ద‌క్కించు కోవ‌డం ఇదే మొద‌టి సారి కావ‌డం విశేషం.

బ్రాండ్ ఫైనాన్స్ గ్లోబ‌ల్ గ‌త ఏడాది ఆఖ‌రులో ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న బ్రాండ్ల‌ను ప‌రిశీలించింది. ఆ మేర‌కు 1000 శాతానికి ప‌రిమితం చేస్తూ అందులో వ‌చ్చిన పారామీట‌ర్స్ ఆధారంగా కంపెనీల‌కు ర్యాంకులు ప్ర‌క‌టించింది. 40 కోట్ల యూజ‌ర్ల‌తో ఇండియాలో అతి పెద్ద మొబైల్ నెట్ వ‌ర్క్ కంపెనీగా జియో నిలిచింది.

దీంతో ఆ స్థానాన్ని పొందింది. రిల‌య‌న్స్ కంపెనీ 91.7 పాయింట్లు పొందింది. చౌక ప్లాన్ల‌తో వినియోగ‌దారుల‌ను షాక్ గురి చేసింది. అత్యాధునిక టెక్నాల‌జీ సేవ‌ల‌ను ఈ స‌ర్వీస్ ద్వారా అందిస్తోంది జియో కంపెనీ. దీని నెట్ వ‌ర్క్ తో గూగుల్ అనుసంధానం అవుతోంది. ఇందులో భారీగా పెట్టుబ‌డులు పెడుతోంది. దీంతో దేశ వ్యాప్తంగా మ‌రింత టెక్నాల‌జీ విస్త‌రించ‌నుంది.

No comment allowed please