Kylian Embappe : మేం మళ్లీ వస్తాం..సాధిస్తాం – ఎంబాపే
అర్జెంటీనాతో ఓటమి అనంతరం పోస్ట్
Kylian Embappe : ఫ్రాన్స్ స్కిప్పర్ కేలియన్ ఎంబాపే షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఫిఫా వరల్డ్ కప్ 2022 లో ఫైనల్ లో అద్భుతమైన ఆట తీరును ప్రదర్శించినా పెనాల్టీ షూటౌట్ లో 2-4 తేడాతో ఓటమి పాలైంది. అయితే ఎంబాపే(Kylian Embappe) చరిత్ర సృష్టించాడు. 1966 తర్వాత ఫిఫా వరల్డ్ కప్ లో హ్యాట్రిక్ సాధిస్తే 2022 లో ఆ రికార్డును క్రియేట్ చేశాడు కేలియన్ ఎంబాపే.
చిన్న తనంలోనే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని స్కిప్పర్ స్థాయికి ఎదిగాడు ఈ దిగ్గజ ప్లేయర్. ఈ మెగా టోర్నీలో ఎనిమిది గోల్స్ సాధించాడు. గోల్డెన్ బూట్ అవార్డును అందుకున్నాడు. కానీ ప్రపంచ కప్ ను తాను తాక లేక పోయానన్న బాధకు లోనయ్యాడు ఎంబాపే. అర్జెంటీనాతో ఫైనల్ లో ఓడి పోవడంతో తట్టుకోలేని అభిమానులు విధ్వంసం సృష్టించారు.
రాజధాని పారిస్ లో అల్లర్లకు దిగారు. 14 వేల మంది సైనికులు మోహరించి అదుపులోకి తీసుకు వచ్చారు. స్వయంగా ఫ్రాన్స్ చీఫ్ ఎమ్మాన్యూయెల్ సంయమనం పాటించాలని కోరాడు. దీంతో ఓటమి అనంతరం స్పందించాడు ఎంబాపే(Kylian Embappe). సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేశాడు. ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశాడు.
మేం మళ్లీ వస్తాం..కప్ ను సాధించేందుకు ప్రయత్నం చేస్తామని పేర్కొన్నాడు ఎంబాపే. అతడు చేసిన పోస్ట్ , ఫోటో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది. ఇదిలా ఉండగా మెస్సీ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గా నిలిచాడు. మార్టినెజ్ అత్యుత్తమ గోల్ కీపర్ గా పురస్కారం అందుకున్నాడు.
Also Read : కింగ్ పిన్’ కైలియన్ ఎంబాపె