Kylian Mbappe King Pin : ‘కింగ్ పిన్’ కైలియ‌న్ ఎంబాపె

రియ‌ల్ స్టార్ గ్రేట్ స్ట్రైక‌ర్

Kylian Mbappe King Pin : సాక‌ర్ సంబురం ముగిసింది. కానీ ఎన్నో మధుర‌మైన జ్ఞాప‌కాలు మిగిలాయి. అన్నింటి కంటే లియోనెల్ మెస్సీ త‌న క‌ల‌ను సాకారం చేసుకుంటే ఒకే ఒక్క‌డు మాత్రం టోర్నీలో సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్ గా మారాడు.

అత‌డు ఎవ‌రో కాదు ఫ్రాన్స్ కు చెందిన కైలియ‌న్ ఎంబాపె. ఉత్కంఠ భ‌రిత‌మైన ఫైన‌ల్ లో ఏకంగా హ్యాట్రిక్ కొట్టాడు. వ‌రుసగా మూడు గోల్స్ తో చుక్క‌లు చూపించాడు అర్జెంటీనాకు.

కానీ పెనాల్టీ షూటౌట్ లో అర్జెంటీనా ఫ్రాన్స్ ను ఓడించింది. కానీ అత్య‌ధిక గోల్స్ సాధించినందుకు ఎంబాపె గోల్డెన్ బూట్ అవార్డు పొందాడు. ఇది ప‌క్క‌న పెడితే యావ‌త్ ప్ర‌పంచం ఇప్పుడు మెస్సీతో పాటు అంతే ధీటుగా ఆడుతూ కోట్లాది మందిని మెస్మ‌రైజ్ చేశాడు కైలియ‌న్ ఎంబాపె.

మైదానంలోకి వ‌చ్చాడంటే చాలు చిరుత‌లా వేటాడుతాడు. సింహంలా జూలు విదుల్చుతాడు. కానీ ఎక్క‌డా త‌గ్గ‌డు. వాయు వేగంతో ఢీకొనేందుకు సిద్దంగా ఉంటాడు. ప్ర‌త్య‌ర్థులు ఎంత మంది ఉన్నా అత‌డి క‌ళ్లు బంతి మీద ప‌డ్డాయంటే ఇక కాళ్ల వ‌ద్ద‌కు రావాల్సిందే. 

అదీ ఈ ఫ్రాన్స్ దిగ్గ‌జ ఆట‌గాడి ప్ర‌త్యేక‌త‌. అందుకే ఎంబాపె ఇవాళ ఐకాన్ గా మారాడు..ల‌క్ష‌లాది మందికి హీరోగా మారి పోయాడు.

క‌ళ్లు చెదిరేలా బంతిని గోల్ వైపు తీసుకు వెళుతుంటే నిల‌బ‌డాల్సిందే. అలాంటి టెక్నిక్ ఎంబాపె సొంతం. ఇక అత‌డి జీవితం ఏమీ పూల పాన్పు కాదు. ఇవాళ ఫ్రాన్స్ ఓడి పోయి ఉండ‌వ‌చ్చు. కానీ కైలియ‌న్ మాత్రం కింగ్ పిన్ గా(Kylian Mbappe) మారి పోయాడు.

ఏరోజుకైనా త‌న దేశానికి వ‌ర‌ల్డ్ క‌ప్ తీసుకు వ‌స్తాన‌ని ప్ర‌క‌టించాడు. ఎంబాపె అల్ల‌ర్ల‌కు ప్ర‌సిద్ది చెందిన ప‌ట్ట‌ణంలో పెరిగాడు. ఆట ప‌రంగా పీలేను గుర్తుకు తెస్తాడు. 

స‌హ‌చ‌ర ఆట‌గాడు నేమార్ కంటే మెరుగైన ప్ర‌తిభ‌ను క‌న‌బ‌రుస్తు విస్తు పోయేలా చేస్తున్నాడు. టీనేజ్ సూప‌ర్ స్టార్ గ‌దా ప్ర‌స్తుతం కీర్తించ బ‌డుతున్నాడు ఎంబాపె. 

బాల్యంలో ఎన్నో క‌ష్టాలు. కానీ అవేవీ ఆడేందుకు అడ్డంకి కాలేదు అత‌డికి. న‌గ‌రం నా చుట్టూ తిరుగుతోంద‌ని దాని ప్ర‌భావాన్ని గ్ర‌హించేందుకు కొంత స‌మయం ప‌ట్టింద‌న్నాడు త‌న జ్ఞాప‌కాల‌ను నెమ‌రు వేసుకుంటూ ఎంబాపె.

నేమార్ కంటే ఎంబాపె ఏదో ఒక రోజు పేరు సంపాదించ‌డం ఖాయ‌మ‌న్నాడు ప్ర‌ముఖ కోచ్ ఆంటోనియా రికార్డి. గ‌త 40 ఏళ్ల కాలంలో అతి త‌క్కువ

కాలంలో అత్య‌ధిక గోల్స్ చేసిన అతి పిన్న వ‌య‌స్కుడైన ఫుట్ బాల‌ర్ గా పేరొందాడు ఎంబాపె.

ఏం జ‌రుగుతుందోన‌ని ఆలోచించే లోపే నేను బంతిని గోల్ గా మ‌లిచి వెళ్లి పోవాల‌ని అనుకుంటాను అని అన్నాడు ఎంబాపె ఓ సంద‌ర్భంంలో. ప్ర‌స్తుతం

సాక‌ర్ ప్ర‌పంచంలో మెస్సీ, నేమార్, రొనాల్డో తో పాటు ఇప్పుడు ఎంబాపె కూడా చేరి పోయాన‌డంలో సందేహం లేదు.

రాబోయే రోజుల్లో సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్ మాత్ర‌మే కాదు అత‌డు కింగ్ పిన్ అవుతాడ‌ని మాత్రం చెప్ప‌క త‌ప్ప‌దు.

Also Read : లియోనెల్ మెస్సీ..మెబాప్పే వైర‌ల్

Leave A Reply

Your Email Id will not be published!