Narottam Mishra Rahul : రాహుల్ కామెంట్స్ మిశ్రా ఫైర్

ప‌రిణ‌తి లేని నాయ‌కుడు గాంధీ

Narottam Mishra Rahul : కాంగ్రెస్ అగ్ర నాయ‌కుడు రాహుల్ గాంధీ చేసిన కామెంట్స్ పై మ‌ధ్య‌ప్ర‌దేశ్ మంత్రి న‌రోత్త‌మ్ మిశ్రా నిప్పులు చెరిగారు. గాంధీ మొహ‌బ్బ‌త్ కా దుకాన్ పేరుతో వ్యాఖ్యానించ‌డాన్ని తప్పు ప‌ట్టారు. బీజేపీ ద్వేషాల మార్కెట్ లో ప్రేమ దుకాణం పెడుతున్నామంటూ స్ప‌ష్టం చేశారు.

ద్వేషంతో రాహుల్ గాంధీకి చేదు అనుభ‌వం ఎదురైంద‌న్నారు న‌రోత్త‌మ్ మిశ్రా. హోం శాఖ మంత్రి మిశ్రా శీతాకాల అసెంబ్లీ స‌మావేశంలో కాంగ్రెస్ పార్టీపై అవిశ్వాస తీర్మానం ప్ర‌వేశ పెట్టారు. రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో 38 మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడి క్రాస్ ఓటింగ్ జ‌రిగిన ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ చీఫ్ క‌మ‌ల్ నాథ్ పై ప్ర‌తిప‌క్ష నేత గోవింద్ సింగ్ అవిశ్వాస తీర్మానం తీసుకు రావాల్సి ఉంద‌ని న‌రోత్త‌మ్ మిశ్రా(Narottam Mishra) అన్నారు.

రెండు ల‌క్ష‌ల రూపాయ‌ల వ‌ర‌కు రైతుల రుణాలు మాఫీ చేస్తామ‌ని, నిరుద్యోగ భృతి రూ. 4,000 , కూతుళ్ల‌కు రూ. 51,000 చొప్పున ఇస్తామ‌న్న త‌ప్పుడు వాగ్ధానాల‌తో అవిశ్వాస తీర్మానం తీసుకొచ్చి ఉండాల్సింద‌న్నారు. ఎన్ని హామీలు ఇచ్చినా తాము స‌ర్కార్ ను ఏర్పాటు చేశామ‌న్నారు న‌రోత్త‌మ్ మిశ్రా.

ప్ర‌భుత్వం ప్ర‌తి ప్ర‌తిపాద‌న‌పై చ‌ర్చ‌కు సిద్దంగా ఉంద‌న్నారు. ప్ర‌తి నోట్ పై స‌మాధానాలు ఇస్తామ‌న్నారు. ద్వేషం వ‌ద్దు ప్రేమ‌ను పంచాల‌ని ప‌దే ప‌దే చెబుతున్న రాహుల్ గాంధీ తానే ద్వేషిగా మారి పోయార‌ని ఎద్దేవా చేశారు. త‌మ‌ను విమ‌ర్శించేందుకే ఆయ‌న త‌న స‌మ‌యాన్ని వెచ్చిస్తున్నారంటూ మండిప‌డ్డారు న‌రోత్త‌మ్ మిశ్రా(Narottam Mishra).

క‌మ‌ల్ నాథ్ , దిగ్విజ‌య్ సింగ్ మ‌ధ్య అశోక్ గెహ్లాట్ స‌చిన్ పైలట్ ల మ‌ధ్య చోటు చేసుకున్న ద్వేషాన్ని రాహుల్ తెలుసుకోలేక పోతున్నాడ‌ని ఫైర్ అయ్యారు.

Also Read : విద్వేష రాజ‌కీయాలు ఇక చెల్ల‌వు – రాహుల్

Leave A Reply

Your Email Id will not be published!