MLC Kavitha ED : లిక్క‌ర్ స్కాంలో క‌విత‌కు 32 శాతం వాటా

సౌత్ గ్రూప్ లో ఎమ్మెల్సీ కీల‌క పాత్ర - ఈడీ

MLC Kavitha ED : తీగ లాగితే డొంకంతా క‌దిలింది. తెలంగాణ సీఎం కేసీఆర్ ముద్దుల కూతురు , తెలంగాణ జాగృతి సంస్థ అధ్య‌క్షురాలు , ఎమ్మెల్సీ క‌వితకు సంబంధించి సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట పెట్టింది కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ). ఇండో స్పిరిట్ మేనేజింగ్ డైరెక్ట‌ర్ స‌మీర్ మ‌హేంద్రును అరెస్ట్ చేసిన అనంత‌రం చేప‌ట్టిన విచార‌ణ‌లో వీట‌న్నింటిని రాబ‌ట్టింది.

ఈ మేర‌కు 268 పేజీల నివేదిక‌ను కోర్టుకు స‌మ‌ర్పించింది. ఇందులో దిమ్మ తిరిగే వాస్త‌వాల‌ను ప్ర‌క‌టించింది. చెన్నైకి చెందిన వ్యాపారి రామ‌చంద్ర పిళ్లై , ఎంపీ మాగుంట శ్రీ‌నివాసులు రెడ్డి, అర‌బిందో ఫార్మా డైరెక్ట‌ర్ శ‌ర‌త్ చంద్రా రెడ్డితో పాటు ఎమ్మెల్సీ క‌విత(MLC Kavitha) ఈ మొత్తం లిక్క‌ర్ స్కాంలో కీల‌క పాత్ర పోషించింద‌ని వెల్ల‌డించింది.

ఒక ర‌కంగా కోలుకోలేని షాక్ ఇచ్చింది కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌. నిన్న‌టి దాకా త‌న‌కు ఏ పాపం తెలియ‌దంటూ చిలుక ప‌లుకులు ప‌లికిన ఎమ్మెల్సీ క‌విత‌కు ఆధారాల‌తో స‌హా బ‌య‌ట పెట్టింది. త్వ‌ర‌లో అరెస్ట్ చేసేందుకు ఆస్కారం ఉంద‌ని దీన్ని బ‌ట్టి చూస్తే తెలుస్తుంది.

శ‌ర‌త్ చంద్రా రెడ్డి భార్య క‌నికా రెడ్డికి చెందిన చార్ట‌ర్ ఫ్లైట్ లో ఢిల్లీ నుంచి హైద‌రాబాద్ కు , హైద‌రాబాద్ నుంచి ఢిల్లీకి చ‌క్క‌ర్లు కొట్టార‌ని తెలిపింది. వ‌చ్చిన వాటాను ఆమ్ ఆద్మీ పార్టీకి పంపిణ చేశార‌ని తెలిపింది.

ఈ మొత్తం వ్య‌వ‌హారం ఎమ్మెల్సీ క‌విత ఇంట్లో , ఆ త‌ర్వాత ఢిల్లీలోని ఒబేరాయ్ హోట‌ల్ లో న‌డిచింద‌ని ఈడీ వెల్ల‌డించింది. కాగా లిక్క‌ర్ స్కాంలో ముఖ్య‌మైన పాత్ర పోషించింది మాత్రం క‌వితేన‌ని స్ప‌ష్టం చేసింది.

Also Read : మ‌ద్యం కుంభ‌కోణంలో క‌విత కీల‌కం – ఈడీ

Leave A Reply

Your Email Id will not be published!