MLC Kavitha Komatireddy : ఈడీ నిర్వాకం ఢిల్లీ స్కాం అబద్దం
స్పష్టం చేసిన ఎమ్మెల్సీ కవిత
MLC Kavitha Komatireddy : కేంద్రం కావాలని తనను ఇరికించాలని చూస్తోంది. నేను ఎలాంటి తప్పు చేయలేదు. నాకు దానితో సంబంధం లేదని పేర్కొన్నారు ఎమ్మెల్సీ కవిత. తాజాగా కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఇండో స్పిరిట్ మేనేజింగ్ డైరెక్టర్ సమీర్ మహేంద్రుకు సంబంధించి దాఖలు చేసిన ఛార్జ్ షీట్ లో ఎమ్మెల్సీ కవిత పేరు చేర్చింది.
ఆమెకు ఇందులో కీలకమైన పాత్ర ఉందంటూ పేర్కొంది. సౌత్ గ్రూప్ లో ఆమెనే కీలక భూమిక పోషించిందని వెల్లడించింది. దేశ వ్యాప్తంగా మరోసారి ఎమ్మెల్సీ కవిత హాట్ టాపిక్ గా మారారు. ట్విట్టర్ వేదికగా మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ గోపాల్ రెడ్డి కవితకు(MLC Kavitha Komatireddy) సంబంధించిన ఓ వార్తను షేర్ చేశారు.
దీనికి సంబంధించి ఎమ్మెల్సీ కవిత స్పందించారు. 28 సార్లు ప్రస్తావించినా లేక 28 వేల సార్లు చేర్చినా లేదా ఉచ్చరించినా తనకు ఏమీ కాదని స్పష్టం చేశారు. తనను ఎవరు ఏమీ చేయలేరన్నారు. కేంద్రం కావాలని చేస్తున్న కుట్ర తప్ప మరేమీ లేదని పేర్కొన్నారు ఎమ్మెల్సీ కవిత. రాజగోపాల్ రెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
ఎన్నిసార్లు అబద్దాలు చెప్పినా నిజాలు అయి పోవని అన్నారు. తాను కేంద్ర దర్యాప్తు సంస్థలకు సహకరించేందుకు సిద్దంగా ఉన్నానని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి ఇప్పటికే కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ విచారణ చేపట్టింది డిసెంబర్ 11న. 41పీఆర్సీ కింద మరోసారి నోటీసు ఇచ్చింది. ఇదే క్రమంలో ఈడీ సమర్పించిన చార్జ్ షీట్ ఇప్పుడు కలకలం సృష్టిస్తోంది.
Also Read : పేరు పిళ్లైది దందా నడిపింది కవితే – ఈడీ